Thursday, January 23, 2025

భారత సమాఖ్యలో హైదరాబాద్ విలీనం…..

- Advertisement -
- Advertisement -

Hyderabad merger into Indian union

బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో స్వాతంత్య్రం ఇచ్చే దిశగా సంకేతాలు ఇవ్వడంతో హైదరాబాద్ సంస్థానం విలీనం చేయాలని ప్రజలు పోరాటాలు ఉదృతం చేశారు.
భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చే నాటికి 562 సంస్థానాలు ఉండగా 4 సంస్థానాలు మినహాయించి మిగతా సంస్థానాలు భారత యూనియన్లో విలీనం అయ్యాయి. అవి
1. కాశ్మీర్ 2. ట్రావెన్‌కోర్ 3. జునాఘడ్ 4. హైదరాబాద్
అతిపెద్ద సంస్థానం హైదరాబాద్ సంస్థానం.
7వ నిజాం పాలనలో అధిక సంఖ్యలో ప్రజల ప్రయోజనాలు దెబ్బతిన్నాయి.
ఇతని పరిపాలనా కాలంలోనే భారత దేశానికి బ్రిటీష్ ప్రభుత్వం స్వాతంత్య్రం ప్రకటించింది.
ఆపరేషన్ పోలో ముందు సంఘటనలు
మార్చి 16, 1946న భారత్‌కు స్వాతంత్య్రం ప్రకటించే ముందు భారత్‌లో గల పరిస్థితులను పరిశీలించడానికి బ్రిటీష్ క్యాబినెట్ మిషన్ భారత్‌లో పర్యటించింది.
ఈ పర్యటనలో భారత్ పాకిస్థాన్ విభజన, సంస్థాన విలీన విషయాలపై ప్రధానంగా చర్చ జరిగింది.
1946 జూన్‌లో సంస్థానాలను స్వతంత్ర భారత్‌లో విలీనం చేసే విషయమై చర్చించడానికి డిల్లీలో సంస్థాన ప్రజా ప్రతినిధుల సభ జరిగింది.
ఈ సమావేశానికి హాజరైన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ (హెచ్‌ఎస్‌సి) ప్రతినిధులు 1. స్వామి రామానంద తీర్ధ 2. భూర్గుల రామక్రిష్ణారావు
ఆంధ్రమహాసభ ప్రతినిధులు 1. రావి నారాయణ రెడ్డి 2. లక్ష్మినర్సయ్య.
వీరందరు హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనం కావాలని అభిప్రాయాలు తెలిపారు.
1946 ఆగస్టులో హైదరాబాద్ ప్రధాన మంత్రిగా మీర్జాఇస్మాయిల్ నియమించబడ్డాడు.
1946 సెప్టెంబర్ 2న కేంద్రంలో కాంగ్రెస్ ముస్లిం లీగ్‌లతో కూడిన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
ఈ కారణంగా హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికలు జరగాలని, హైదరాబాద్ భారత్‌లో విలీనం కావాలని హెచ్‌ఎస్‌సి, ఆంధ్రమహాసభలు విడివిడిగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి.
నిజాం 1946 నవంబర్ 17, 18, 19 తేదీలలో శాసన మండలి సభ్యుల ఎన్నిక జరుగుతుందని ప్రకటించారు.
నూతన రాజ్యాంగ సంస్కరణల ప్రకారం సామాన్య ప్రజలకు ఓటు హక్కులేదు.
ఓటు హక్కు కలిగినవారు
వ్యవసాయదారుల నియోజక వర్గంలో 100 రూపాయలు కౌలు లేదా భూమి శిస్తు చెల్లించేవారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో, ఇతర పట్టణాలలో నెలకు రూ 5 ఇంటి అద్దె చెల్లించేవారు.
l నెలకు జీతం స్త్రీలకు రూ. 15, పురుషులకు రూ. 20 వచ్చేవారు.
l ఈ సంస్కరణల ప్రకారం జమీందార్లు, జాగీర్ధార్లు, దేశ్‌ముఖ్‌లు, పటేల్, పట్వారి, షావుకార్లు, భూస్వాములు, ఉన్నత ఉద్యోగులకు తప్ప సామాన్యులకు, మద్యతరగతి, చేనేత, తదితర వృత్తుల వారికి, బీదలకు ఓటు హక్కు లేదు.
l శాసన మండలికి మొత్తం సభ్యుల సంఖ్య 132
l ఇందులో 76 మంది ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడతారు.
l 56 మంది నిజాం నామినేట్ చేస్తారు.
l నూతన రాజ్యాంగ సంస్కరణల ప్రకారం జరుపబడిన ఎన్నికలను బహిష్కరించింది.
l డిసెంబర్ 1, 1946న నూటికి 99 మందికి ఓటు హక్కులేని ఈ సంస్కరణలు బూటకపు సంస్కరణలు అని ఆంధ్రమహాసభ పేర్కొంది.
l హైదరాబాద్ సంస్కరణలు భగ్నం చేయ్యండి ప్రజా రాజ్యం కోసం పోరాడండి, అని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి ఆంద్రమహాసభ పిలుపునిచ్చింది.
l ఈ పిలుపుతో నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజా పోరాటం ప్రారంభమైంది.
ప్రజా ఉద్యమం మొదలు
l ఇదే సమయంలో 1946 డిసెంబర్ కాసీం రజ్వీ ఎంఐఎం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
l ఒక వైపు నిజాం నిరంకుషత్వం, మరోవైపు ఖాసీం రజ్వి నాయకత్వంలోని రజాకార్లు రాక్షసత్వంతో తెలంగాణ ప్రాంతం అట్టుడికి పోయింది.
l నిజాం పాలన నుండి హైదరాబాద్ శాశ్వతంగా విముక్తి చేయబడి భారత యూనియన్లో విలీనం కావాలని కోరుతూ హెచ్‌ఎస్‌సీ, ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీ, భారత సోషలిస్టు పార్టీలు ఉద్యమాన్ని చేపట్టాయి.
l ఈ ఉద్యమం ప్రాజా ఉద్యమంగా మారింది.
జయప్రకాశ్‌నారాయణ్ పర్యటన
l మే 7న 1947న జయ ప్రకాశ్ నారాయణ్ (అఖిలభారత సోషలిస్టు ప్రధాన కార్యదర్శి) హైదరాబాద్‌లో పర్యటించారు.
l నిజాం నిషేదాజ్ఞలను దిక్కరించి సికింద్రాబాద్‌లోని కర్సలా మైదానంలో ప్రసంగిస్తూ నిజాంను మీర్ జాపర్‌గా పేర్కొన్నాడు.
l హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్లో చేరుటకు ఆ ప్రభుత్వంపై ప్రజలు ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
l సభ ముగిసిన తర్వాత బి.ఎస్ మహాదేవ్ (సోషలిస్టు పార్టీ నాయకుడు)ని జయప్రకాష్ నారాయణ కలిసారు.
l జయప్రకాశ్ నారాయణ్‌కు పోలీసులు నగర బహిష్కరణ నోటీసులు అందజేసి రాత్రిక రాత్రి ప్రత్యేక విమానంలో బొంబాయికి తరలించారు.
l నగర బహిష్కరణను హెచ్‌ఎస్‌సీ తీవ్రంగా వ్యతిరేకించింది.
l బూర్గుల రామకృష్ణారావు నాయకత్వంలో కమిటీ ఏర్పాటు చేసి నిరసనలు ప్రదర్శించారు.
l నిజాం షుగర్ ఫ్యాక్టరి, అజాంజాహి మిల్ కార్మిక సంఘాలకు బిఎస్. మహాదేవ్, ఎస్.బి గిరి నాయకత్వం వహించి ఉద్యమాలు నిర్వహించారు.
l 1947 మే 15న నిజాం ప్రధాని మీర్జా ఇస్మాయిల్ రాజీనామ చేయగా 2వ సారి ప్రధానిగా చత్తారి నవాబు నియమించబడ్డాడు.
l 1947 జూన్ 16, 17,18 తేదీలలో హెచ్‌ఎస్‌సీ ప్రథమ మహాసభ హైదరాబాద్‌లోని ముషిరాబాద్‌లో స్వామి రామానందతీర్ధ అధ్యక్షతన జరిగింది.
తొలి సమావేశంలో హెచ్‌ఎస్‌సీ ప్రతిపాదించిన అంశాలు
l హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావాలి.
l భారత రాజ్యాంగ సభకు హైదరాబాద్ ప్రతినిధులను పంపాలి.
l భాద్యతాయుత ప్రభుత్వంను ఏర్పాటు చేయాలి.
l 1947 జులై 5న సర్ధార్ వల్లభాయ్ పటేల్ భారత యూనియన్లో చేరాలని నిజాంకు విజ్ఞప్తి చేశాడు.
l రక్షణ, వార్త ప్రసారం, విదేశీ వ్యవహారాలు మినహా మిగతా అన్ని విషయాలలో హైదరాబాద్ స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించారు.
l నిజాం అంగీకరించలేదు.
జాయిన్ ఇండియా ఉద్యమం
l జులై 31, 1947న జాయిన్ ఇండియా యూనియన్ డే జరపాలని ఎహెచ్‌ఎస్‌యూ (ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్) పిలుపునిచ్చింది.
l అదేరోజు ఎహెచ్‌ఎస్‌యూ స్వామి రామానంద తీర్థను కలిసి జాయిన్ ఇండియన్ యూనియన్ నినాదంతో హెచ్‌ఎస్‌సీ ఉద్యమం ప్రారంభించాలని కోరారు.
l హెచ్‌ఎస్‌సీ త్వరలోనే ఉద్యమాన్ని ప్రారంభిస్తుందని రామానందతీర్ధ విద్యార్థులకు హామీ ఇచ్చాడు.
l ఆగస్టు 7, 1947న స్వామి రామానందతీర్ధ నాయకత్వంలో జాయిన్ ఇండియా యూనియన్‌కు హెచ్‌ఎస్‌సీ పిలుపునిచ్చింది.
l అదే రోజు స్వామి రామానందతీర్ధ సుల్తాన్ బజార్ కూడలిలో సత్యాగ్రహం చేపట్టాడు.
l ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి మరుసటి రోజునే విడుదల చేసింది.
l ఆగస్టు 15, 1947న భారతదేశం స్వాతంత్య్రం పొందింది.
l స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన రాజ్యంలో జాతీయజెండాను ఎగురవేయడాన్ని నిషేదిస్తూ నిజాం ఫర్మానాను జారీ చేశాడు.
l 1947 ఆగస్టు 15న నెహ్రూ తనకు అందజేసిన జాతీయ పతాకాన్ని స్వామి రామానందతీర్ధ సామాన్యుడితో ఎగురవేయించారు.
l జాతీయ పతాకాన్ని సుల్తాన్ బజార్‌లో మోతీలాల్ ఎగురవేశారు.
జాతీయ జెండాను ఎగురవేసిన వారు
l జమలాపురం కేశవరావు మధిర
l కాళోజీ నారాయణరావు వరంగల్
l కొలిపాక వెంకటకిషన్ ఖమ్మం
l ఎంఎస్ రాజలింగం వరంగల్
l మాధవరావు వరంగల్
సాయుధ పోరాట ప్రకటన
l సెప్టెంబర్ 11, 1947న ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీలు.. నిజాం పాలనను అంతం చేయడానికి సాయుద పోరాటం తప్ప మరో మార్గం లేదని అధికారికంగా సాయుద పోరాట ప్రకటన చేసాయి.
పోలీస్ చర్యకు దారితీసిన పరిస్థితులు
l హైదరాబాద్ రాజ్యానికి ఉస్మానిస్థాన్ పేరు పెట్టాలని చౌదరి హకమత్ అలీగుజర్ సూచించాడు.
l జూన్ 3, 1947న నిజాం ఫర్మానా జారీ చేశాడు.
l ఈ ఫర్మానా ప్రకారం ఆగస్టు 15, 1947న హైదరాబాద్ రాజ్యం స్వతంత్ర సార్వభౌమాధికార రాజ్యాన్ని పొందుతుందని, హైదరాబాద్ భారత్‌లో విలీనం కాదని ప్రకటించారు.
l ఈ ఫర్మానాను హెచ్‌ఎస్‌సీ వ్యతిరేకించింది.
l హైదరాబాద్‌లో భాద్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భారత్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేసింది.

వెంకటరాజం బొడ్డుపల్లి,
సీనియర్ ఫ్యాకల్టీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News