Sunday, December 22, 2024

ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న మెట్రో…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రోరైల్ ఐదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుగా నిలిచింది. గత ఐదేళ్లుగా అనేక మైలురాళ్లను సాధించింది. హైదరాబాద్ నగర ప్రయాణ మార్గానికి కొత్త నిర్వచనం తీసుకొచ్చింది. మెట్రోరైల్ మొదట దశ 28 నవంబర్ 2017లో నాగోల్ -అమీర్‌పేట- మియాపూర్ మార్గంలో 30కిమీ 24 స్టేషన్లతో నిర్మించిన కారిడార్‌ను ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభించారు. మెట్రో రైల్ అభివృద్ది చెందుతున్న నగర ట్రాఫిక్‌ను నిర్వహించడానికి అత్యంత ఆచరణీయమైన ఎంపికను అందించింది. 7 ఫ్రిబవరి 2020న మెట్రో రైలు రెండవ అతిపెద్ద మెట్రోగా అవతరించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు 11 కిమీ మేర గ్రీన్‌లైన్ కారిడాన్‌ను ప్రారంభించారు. మెట్రో రైల్ ప్రాజెక్టు 57 స్టేషన్లతో ఎలివేటెడ్ స్ట్రక్చర్‌లపై 69.2 కిమీలను అభివృద్ది చేసింది.

మూడు కారిడార్‌లో రైడ్ లైన్( మియాపూర్ నుంచి ఎల్బీనగర్), గ్రీన్‌లైన్ (జూబ్లీబస్‌స్టేషన్‌వరకు ఏర్పాటు చేశారు. ఎంజిబిఎస్ బ్లూలైన్ నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ప్రస్తుతం మెట్రో రైల్ మూడు కారిడార్ల ద్వారా రోజుకు 4 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 57 మెట్రో స్టేషన్లతో 69.2 కిమీ విస్తీర్ణంలో మూడు లైన్లు నిర్మించడంతో పాటు వాణిజ్య కార్యకలపాల నిర్వహణ ముఖ్య మైలురాళ్లుగా చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News