Sunday, September 8, 2024

మెట్రో రికార్డు

- Advertisement -
- Advertisement -

hyderabad-metro

సోమవారం ఒక్కరోజే 4.47లక్షలమంది ప్రయాణం
జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ కారిడార్‌లో 34వేల మంది రాకపోకలు
ప్రయాణికుల సంఖ్య పెరగడంలో సత్ఫలితాలిచ్చిన క్యూఆర్ కోడ్

హైదరాబాద్: నగరంలో ఈనెల 7న సిఎం కెసిఆర్ మెట్రో కారిడార్2 జెబిఎస్‌నుంచి ఎంజిబిఎస్ వరకు ప్రారంభించారు. దీంతో నగరంలో ప్రభుత్వం 2012 సంవత్సరంలో ప్రారంభించిన మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేశారు. నగర ప్రజలకు మూడు కారిడార్లు అందుబాటులోకి రావడంతో సోమవారం 4.47లక్షలమంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు చేరుకున్నారు. అదే విధంగా జెబిఎస్, ఎంజిబిఎస్ మార్గంలో ఈనెల 10న 34వేల మంది రాకపోకలు సాగించినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. నెలరోజుల్లో పుంజుకోవచ్చని, మెట్రో ప్యాసింజర్ రాకపోకల క్యూఆర్ కోడ్ వినియోగదారుల్లో స్థిరమైన పెరుగుదల ఉండి 20కె చుట్టు ఉండేది.

తాజాగా 47కె వరకు పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించిన స్టేషన్లు వివరాలు చూస్తే అమీర్‌పేట 26వేలు, ఎల్‌బినగర్ 24వేలు, రాయదుర్గం 22వేలు, మియాపూర్ 19వేలు, కెబిహెచ్‌బి 17వేలు, సికింద్రాబాద్ ఈస్ట్ 15వేల మంది వెళ్లినట్లు మెట్రో ఉన్నతాధికారులు చెప్పారు. కారిడార్1లో 2,45,825మంది, కారిడార్2లో 33,886 మంది, కారిడార్3లో 1,67,298 మంది ప్రయాణించారని, సోమవారం మూడు కారిడార్ల పరిధిలో 4,47,009 మంది రాకపోకలు సాగించినట్లు వారు వెల్లడించారు.

Hyderabad Metro Creates New Record

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News