- Advertisement -
హైదరాబాద్: మెట్రో రైలు ప్రయాణికులకు మెట్రో ఎండీ ఎన్‌విఎస్ రెడ్డి శుభవార్త అందించారు. ఇప్పటివరకూ మెట్రో నడిచే సమయాన్ని పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఆఖరి రైలు రాత్రి 11 గంటల వరకే అందుబాటులో ఉంటుందనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సమయాన్ని రాత్రి 11.45 గంటల వరకూ పొడిగిస్తున్నట్లు ఎన్‌విఎస్ రెడ్డి ప్రకటించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు. అయితే ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకే ఈ సమయ వేళలు అమలులో ఉండనున్నాయి. అంతేకాక ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు 20 ట్రిప్పుల డబ్బులతో 30 ట్రిప్పులు వెళ్లే ఆఫర్‌ను మరో ఏడాది పొడిగించారు.
- Advertisement -