Saturday, December 21, 2024

రూ.59లతో రోజంతా మెట్రో ప్రయాణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగర వాసులకు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు సువర్ణావకాశం కల్పించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణవాసులు పల్లెలకు పయనయ్యారు. దీంతో నగరం అంతా నిర్మానుష్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే మెట్రో రైలు ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. ఈ క్రమంలోనే అధికారులు హైదరాబాద్ మెట్రోలో నేటి నుంచి మూడు రోజుల అపరిమిత ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరైతే మెట్రో కార్డ్ కలిగి ఉన్నారో వారు రూ.59 రీఛార్జ్ చేయడం వల్ల ఈ అవకాశాన్ని వినయోగించుకోవచ్చు. జనవరి 13, 14, 15 తేదీల్లో మెట్రో హాలీడే కార్డు వర్తిస్తుందని, ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఆ రోజంతా రైలులో ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు.

రూ.50 చెల్లించి కొత్త కార్డు….
మొదట్లో దీని ధర 59 రూపాయలు ఉండగా కొన్ని నెలల తర్వాత 99 రూపాయలు చేశారు. ఇప్పుడు మళ్లీ పాత ధరకే (రూ.59లకే) అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో మెట్రో ప్రయాణికులు కొనుగోలు చేసిన హాలిడేస్ కార్డుతో ఈ సౌకర్యాలు పొందవచ్చు. హాలీ డే సూపర్ సేవర్ కార్డులేని వారు రూ.50 చెల్లించి కొత్త కార్డును కొనుగోలు చేయాలి. ఆ తర్వాత 59 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. మెట్రో స్టేషన్లలో కౌంటర్ల వద్ద ఈ కార్డు లభిస్తుంది. 2024, మార్చి 31వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News