Sunday, December 22, 2024

క్రికెట్ ప్రేమికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: క్రికెట్ ప్రేమికులకు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఈ మేరకు ట్విట్టర్ వేదిక గురువారం ఓ ప్రకటన చేసింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో ఐపిఎల్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో సేవలు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. గురువారం రాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని మెట్రో అధికారులు తెలిపారు.

రాత్రి 12:15 గంటలకు చివరిరైలు ప్రారంభమై 1:10 రాత్రి గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందన్నారు. అయితే ఉప్పల్ స్టేడియం ఎన్జీఆర్‌ఐ స్టేషన్‌లలో మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్‌లలో రైలు దిగే వారికే అనుమతి ఉంటుందని ఎక్కడానికి మాత్రం వీలుండదని స్పష్టం చేసింది. కాగా, ఇవాళ ఉప్పల్‌లో జరిగే ఐపిఎల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News