Monday, September 30, 2024

మెట్రో రెండో దశలో ఫోర్త్ సిటీకి రైలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డిపిఆర్‌కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోం ది. మొత్తం 116.2 కిలోమీటర్ల మెట్రో రైలు రెండో దశకు రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించారని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి తెలిపా రు. రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ చేపట్టనున్నారు. రెండో దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకి మెట్రోరైలు సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎన్‌విఎస్ రెడ్డి వెల్లడించారు. డిపిఆర్ తుది దశకు చేరుకున్నట్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎఎంఎల్) ఎండి ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైల్ రెండో దశ డిపిఆర్ (డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారీ పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం మున్సిప ల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ సీనియర్ అధికారులతో సమీక్షించారు.

ఎన్‌విఎస్ రెడ్డి మెట్రో రెండో దశ కారిడార్‌ల అలైన్‌మెంట్, ముఖ్యమైన ఫీచర్లు, స్టేషన్‌లు మొ దలైన వాటిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవివరమైన ప్రె జెంటేషన్ ఇచ్చారు. అన్ని కారిడార్‌లకు సంబంధించిన డిపిఆర్‌లకు తుది మెరుగులు దిద్దుతున్నామని, ట్రాఫిక్ అంచనా ల విషయంలో హెచ్‌ఎండిఎ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాకు సిద్ధం చేస్తున్న కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సిఎంపి) ట్రాఫిక్ అధ్యయన నివేదిక కోసం హెచ్‌ఎఎంఎల్ ఎదురుచూస్తోందని ఎన్‌విఎస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరించారు. మెట్రో మార్గాల్లో ట్రాఫిక్ అంచనాలను సిఎంపితో క్రాస్-చెక్ చేయా ల్సి ఉంటుందని ఎండి ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. రెం డవ దశ మెట్రో కారిడార్‌లు కేంద్ర ప్రభుత్వ అనుమతుల కో సం డిపిఆర్‌లను సమర్పించడానికి ఇది తప్పనిసరిగా చేయా ల్సి ఉంటుంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్‌ను ఆరాంఘర్, 44వ నెంబర్ జాతీ య రహదారి (బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాం తం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేస్తున్నట్లు ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు.

9 కారిడార్లలో పరుగులు తీయనున్న మెట్రోరైలు
ఎయిర్‌పోర్టు నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. వివిధ ప్రత్యామ్నాయాల గురించి లోతైన చర్చల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెట్రో రెండో దశ కారిడార్‌ల విస్తృత కాంటూర్‌లను ఆమోదించారు. వాటికి సంబంధించిన వివరాలు ఈ విధం గా ఉన్నాయి. కారిడార్ -4లో నాగోల్ – ఆర్‌జిఐఎ (ఎయిర్ పోర్ట్ కారిడార్) వరకు 36.6 కి.మీ వరకు, కారిడార్ -5లో రాయదుర్గ్ -కోకాపేట్ నియోపోలీస్ వరకు 11.6 కి.మీలు వరకు, కారిడార్ – 6లో ఎంజిబిఎస్, – చాంద్రాయన్‌గుట్ట వరకు (ఓల్డ్ సిటీ కారిడార్) 7.5 కి.మీ వరకు నడవనున్నాయి. కారిడార్ -7లో మియాపూర్,- పటాన్ చెరు వరకు 13.4 కి.మీ వరకు,

కారిడార్ -8లో ఎల్‌బి నగర్ – హయత్‌నగర్ వరకు 7.1 కి.మీ వరకు, కారిడార్ -9లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం – ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ) వరకు 40 కి.మీ వరకు మెట్రో రైల్ నిర్మాణం చేయనున్నారు. రెండో దశలో మొత్తం 116.2 కిలోమీటర్ల వరకు మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనున్నారు. కారిడార్ -4 (ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్) నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు దాదాపు 36.6 కి.మీ పొడవును కవర్ చేస్తుంది. ఎల్‌బి నగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ హాస్పిటల్, డిఆర్‌డిఓ, చాంద్రాయన్ గుట్ట, మైలార్‌దేవ్ పల్లి, ఆరాంఘర్, న్యూ హైకోర్టు, శంషాబాద్ జంక్షన్ ద్వారా ఎన్.హెచ్ మీదుగా ఈ మార్గం ఉంటుంది. ఈ ఎయిర్‌పోర్ట్ లైన్ వరుసగా నాగోల్, ఎల్బీ నగర్, చాంద్రాయన్ గుట్ట వద్ద ఉన్న అన్ని మెట్రో లైన్‌లకు అనుసంధానించబడుతుంది. ఈ కారిడార్ మొత్తం 36.6 కి.మీ పొడవులో, 35 కి.మీ ఎలివేట్ చేయబడుతుంది. 1.6 కి.మీ మార్గం భూగర్భంలో వెళ్తుంది. ఈ మార్గంలో భూగర్భ స్టేషన్ ఎయిర్ పోర్ట్ స్టేషన్‌తో సహా మొత్తం 24 మెట్రో స్టేషన్లు ఉంటాయి.

చారిత్రక ప్రాముఖ్యత కారణంగా మారని స్టేషన్ పేర్లు
కారిడార్ -5 రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట్ నియోపోలీస్ వరకు బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్‌రామ్ గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలీస్ మీదుగా బ్లూ లైన్ పొడిగింపుగా నిర్మించబడుతుంది. ఇది మొత్తం ఎలివేటెడ్ కారిడార్. ఇందులో దాదాపు 8 స్టేషన్లు ఉంటాయి. కారిడార్ -6 (ఓల్ సిటీ మెట్రో) ఎంజిబిఎస్ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు గ్రీన్ లైన్ పొడిగింపుగా నిర్మించబడుతుంది. ఎంజిబిఎస్ నుంచి ఈ 7.5 కి.మీ లైన్, ఓల్డ్ సిటీ రోడ్ మీదుగా దారుల్ షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్ నుమా మీదుగా ప్రయాణిస్తుంది. కారిడార్ సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్ నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ఈ పేర్లనే వాటి చారిత్రక ప్రాముఖ్యత కారణంగా స్టేషన్ పేర్లుగా ఉంచారు. ప్రస్తుతం దారుల్ షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ మధ్య 60 అడుగుల రోడ్డు, శాలిబండ జంక్షన్ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు 80 అడుగుల రోడ్డు ఏకరీతిగా 100 అడుగులకు విస్తరించడం జరుగుతుంది. స్టేషన్ ఉండే ప్రాంతాలలో మాత్రం రోడ్డును 120 అడుగులకు విస్తరించడం జరుగుతుంది.

రోడ్డు విస్తరణ, మెట్రో అలైన్‌మెంట్‌లో దాదాపు 1,100 ఆస్తులు ప్రభావితమవుతున్నాయి. ప్రభావితమైన 400 ఆస్తులకు ఇప్పటికే నోటిఫికేషన్‌లు జారీ చేశామని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని హెచ్‌ఎఎంఎల్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయని, వాటన్నింటికీ తగిన ఇంజినీరింగ్ పరిష్కారాలు, మెట్రో పిల్లర్ స్థానాల సర్దుబాటు ద్వారా అవి భంగం కాకుండా చూస్తున్నామన్నారు. ఇది దాదాపు 6 స్టేషన్లతో పూర్తి ఎలివేటెడ్ మెట్రో కారిడార్. కారిడార్ -7 ముంబయి హైవేపై రెడ్ లైన్ పొడిగింపుగా నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఉన్న మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ప్రారంభించి, పటాన్‌చెరు వరకు ఉన్న ఈ 13.4 కి.మీ లైన్ ఆల్విన్ ఎక్స్ రోడ్, మదీనాగూడ, చందానగర్, బిహెచ్‌ఈఎల్, ఇక్రిసాట్ మీదుగా వెళ్తుంది. ఇది దాదాపు 10 స్టేషన్లతో ఉండే పూర్తి ఎలివేటెడ్ కారిడార్. కారిడార్ -8 విజయవాడ హైవేపై ఎల్‌బినగర్ వైపు నుంచి రెడ్ లైన్ పొడిగింపుగా నిర్మించనున్నారు. ఎల్‌బినగర్ నుంచి హయత్ నగర్ వరకు ఈ 7.1 కి.మీ కారిడార్ చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్‌టిసి కాలనీ మీదుగా వెళుతుంది. ఈ పూర్తి ఎలివేటెడ్ కారిడార్‌లో దాదాపు 6 స్టేషన్లు ఉంటాయి.

రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో ఫోర్త్ సిటీ మెట్రో :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీ లైన్ కోసం అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో వినూత్న రీతిలో డిపిఆర్‌ను తయారు చేస్తున్నట్లు ఎన్‌విఎస్ రెడ్డి పేర్కొన్నారు. కొన్ని నెలల్లో కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం దీనిని సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ కొత్త లైన్ డిపిఆర్ మినహా మిగిలిన డిపిఆర్‌లను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీ కోసం సుమారు రూ.8 వేల కోట్లతో కలిపి మొత్తం రెండవ దశ ప్రాజెక్ట్‌కు అయ్యే వ్యయం దాదాపు రూ.32,237 కోట్లుగా అంచనా రూపొందించారు. ఇతర భారతీయ నగరాల్లోని ఇతర మెట్రో రైలు ప్రాజెక్టుల మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్‌గా ఈ ప్రాజెక్ట్ అమలు చేయడానికి ప్రతిపాదనలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News