Sunday, November 3, 2024

మెట్రో ప్రయాణీకుల కోసం సువర్ణ ఆఫర్

- Advertisement -
- Advertisement -
Hyderabad Metro Rail New Offers
45 రోజుల కాలంలో 20 ట్రిప్పులకు చెల్లించి 30 ట్రిప్పులు తిరిగే అవకాశం
ట్రిప్‌కు గరిష్టంగా రూ. 15 చెల్లించి గ్రీన్‌లైన్‌పై ఎక్కడైనా ప్రయాణించవచ్చు
ఓక్యాలెండర్ నెలలో 250 మెట్రో ట్రిప్ కన్నా అధికంగా ప్రయాణించే వారికి ప్రతి నెల లక్కీ డ్రా

హైదరాబాద్: పండగ సీజన్ పురస్కరించుకుని ఎల్ అండ్ టీ మెట్రో మరో మారు పండగ ఆఫర్లను తీసుకువస్తూ మెట్రో సువర్ణ ఆఫర్ 2021ను ప్రకటించింది. అక్టోబర్ 18 నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, ఆఫర్‌లో ట్రిప్ పాస్, గ్రీన్ లైన్‌పై ప్రత్యేక ధర, మెట్రో ప్రయాణీకుల కోసం లక్కీ డ్రా ఉంటాయన్నారు.

ట్రిప్ పాస్ ఆఫర్: ఈఆఫర్ కింద మెట్రో ప్రయాణికులు తమ ప్రయాణ అవసరాలకు తగినట్లుగా ఏదైనా ఫేర్‌తో 30 ట్రిప్పులను కేవలం 20 ట్రిప్పుల ధర చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ కేవలం మెట్రో స్మార్ట్ కార్డ్ (పాత, నూతన) పై మాత్రమే వర్తిస్తుందని, మెట్రో ప్రయాణీకులు ఈ ఆఫర్‌ను 18 అక్టోబర్ 2021 నుంచి 15 జనవరి 2022 మధ్య వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు.

గ్రీన్ లైన్‌పై ప్రత్యేక ఫేర్ ఆఫర్ : ఎంజీబిఎస్, జెబిఎస్ పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ల మధ్య గ్రీన్‌లైన్‌పై ప్రయాణించే ప్రయాణికులు ప్రతి ట్రిప్‌కు గరిష్టంగా రూ. 15 చెల్లిస్తే సరిపోతుంది. మెట్రో ప్రయాణీకులు ఈ ఆఫర్‌ను అన్ని టిక్కెటింగ్ మార్గాలపై 18 అక్టోబర్ 2021 నుంచి 15 జనవరి 2022 వరకు పొందవచ్చు.

నెలవారీ లక్కీ డ్రా:  అక్టోబర్ 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు ఆకర్షనీయమైన బహుమతులను ప్రతి నెల గెలుచుకునే అవకాశం మెట్రో ప్రయాణికులకు ఉంది. ప్రతి నెలా ఐదుగురు విజేతలను లక్కీడ్రా సిఎస్‌సీ కార్డు వినియోగదారుల నుంచి ఎంపిక చేస్తారు. వీరు ఓక్యాలెండర్ నెలలో కనీసం 20 సార్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ సిఎస్‌సీ (కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డు)లను టీ సవారీ, మెట్రో స్టేషన్ల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం మెట్రో స్టేషన్లు సందర్శించవచ్చని తెలిపారు. ఈ ఆఫర్‌ను ప్రకటించిన ఎల్ అండ్ టీ ఎం ఆర్ హెచ్‌ఎల్ ఎండీ అండ్ సీఈవో కెవీబీ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం అక్టోబర్‌లో తొలిసారిగా ప్రకటించిన మెట్రో సువర్ణ ఆఫర్‌కు అపూర్వ స్పందన లభించిందని, ఇప్పడు ఈ సంవత్సరం మరో మారు ఆఫర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

మా ప్రయాణీకులు మా సేవల పట్ల అపారమైన నమ్మకాన్ని చూపడంతో పాటుగా మెట్రోను తమ సురక్షితమైన ప్రయాణ భాగస్వామిగా ఎంచుకుంటున్నారని చెప్పారు. నగరంలో అత్యంత విశ్వసనీయమైన, పర్యావరణ అనుకూల, సమయపాలన కలిగిన , సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా మాధ్యమం అన్నారు. మాప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు మమ్ముల్ని మేము మెరుగుపరుచుకుంటునే ఈ మహమ్మారి కాలంలో అత్యంత సురక్షితమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అదే విధంగా హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ప్రసంగిస్తూ మాప్రయాణికుల కోసం నూతన ఆఫర్లతో మెట్రో సువర్ణ ఆఫర్‌ను తిరిగి పరిచయం చేస్తుండటంతో ఆనందంగా ఉందన్నారు. అత్యంత సురక్షితమైన ప్రయాణ అవకాశాలను అందిస్తూనే మాప్రయాణీకుల నగదుకు తగ్గ విలువను అందించాలనే మా నిరంతర ప్రయత్నాల్లో భాగం ఈమెట్రో సువర్ణ ఆఫర్‌ని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News