Thursday, December 26, 2024

మెట్రో రెండోదశకు రైట్ రైట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. రెండో దశలో ని ర్మించబోయే 76.4 కిలో మీటర్ల మార్గానికి 24,269 కోట్ల రూపాయలను జారీ చేస్తూ జిఓ 196 జారీ చేసింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యం తో మెట్రో రైలు రెండో దశ నిర్మాణం జ రుగుతుందని తెలిపిన ప్రభుత్వం, రాష్ట్ర వాటాగా రూ.7,313 కోట్లు, కేంద్రం వాటాగా 4,230కోట్ల రూపాయలు ఉం టుందని పేర్కొంది. అలాగే జపాన్ ఇం టర్నెషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ, న్యూడెవలప్ మెంట్ బ్యాంకు, ఏషియన్ డెవల ప్ మెంట్ బ్యాంకుల నుంచి 48 శా తం వాటాగా రూ.11,693 కోట్లు, పిపి పి ప ద్దతిలో మరో 1,033 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వు ల్లో వెల్లడించింది.

మొదటి దశలో రూ. 22వేల కోట్లతో 69 కిలోమీటర్లు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించామని, అది ప్ర భుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచంలో నిర్మించిన అతి పెద్ద ప్రాజెక్టుగా ప్రభుత్వం తెలిపింది. రోజుకు 5 లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ట్లు వివరించింది. మొదటి దశ విస్తరణతోపాటు రెండో దశ చేపట్టే క్రమంలో న గర విస్తరణ, ట్రాఫిక్ రద్దీపై సమగ్రంగా అధ్యయనం చేశాక ప్రస్తుతమున్న మూ డు కారిడార్లతోపాటు అదనంగా మరి న్ని కారిడార్లలో మెట్రో సేవలు అవసరమని ప్రభుత్వం గుర్తించినట్లు పురపాల క శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉ త్తర్వుల్లో పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలో మీటర్ల మార్గానికి సర్వే , అం దుకు అనుగుణంగా మెట్రో రైలు రెండో దశ కారిడార్లకు ప్రభుత్వం ఆమోదం తె లిపింది.

రెండో దశలో మొత్తం 116.4 కిలోమీటర్లు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చే సినట్లు వివరించారు. అయితే అందులో మొదటగా పార్ట్ ఏ కింద 76.4 కిలోమీటర్ల మార్గానికి పరిపాలన అనుమతులు మంజూరు చేశామని, పార్ట్ -బిలో నిర్మించనున్న శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలో మీ టర్ల మార్గానికి సర్వే జరుగుతుందని ప్ర భుత్వం తెలిపింది. కారిడార్ 4లో నాగో లు- శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలో మీటర్లు, కారిడార్ 5లో రా యదుర్గ- కోకాపేట నియోపోలీస్ వరకు 11.6 కిలో మీటర్లు, కారిడార్ 6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాణగుట్ట వరకు 7.5 కిలో మీటర్లు, కారిడార్ 7లో మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కిలో మీటర్లు, కారిడార్ 8లో ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 7.1 కిలో మీటర్లు నిర్మించనున్నట్లు తెలిపిన సర్కార్, మెట్రో రైలు రెండో దశ పార్ట్-బిగా కారిడార్ 9లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీలోని స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

రెండో దశ పార్ట్ -ఏ లో ఐదు కారిడార్ల నిర్మాణం
కారిడార్ 4 – నాగోలు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (36.8 కి. మీ)
కారిడార్ 5 – రాయదుర్గం నుంచి కోకా పేట్ నియో పోలీస్ (11.6 కి. మీ)
కారిడార్ 6 – ఎంజిబిఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట (7.5 కి.మీ)
కారిడార్ 7 – మియాపూర్ నుంచి పటాన్ చెరు ( 13.4 కి. మీ)
కారిడార్ 8 – ఎల్‌బి నగర్ నుంచి హాయాత్ నగర్ ( 7.1 కి. మీ)
మెట్రో రైలు రెండో దశ పార్ట్ – బి
కారిడార్ 9 – శంషాబాద్ నుండి ఫ్యూచర్ సిటీ (40 కి. మీ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News