Sunday, December 22, 2024

సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్ మెట్రో రైలు

- Advertisement -
- Advertisement -

ఇప్పటి వరకు 40 కోట్ల మంది ప్రయాణికుల చేరవేత

మనతెలంగాణ/హైదరాబాద్:  హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 40 కోట్ల మంది ప్రయాణికులను మెట్రోరైలు గమ్యస్థానాలకు చేరవేసింది. 2017 నవంబర్ 29న ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోలో ప్రతిరోజు దాదాపు 4 లక్షల 90 వేల మంది ప్రయాణిస్తున్నారు. త్వరలో ఈ సంఖ్య 5 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. క్యాష్‌బ్యాక్, ఉచిత ట్రిప్పులు, మెట్రో పాసులు ఇలా రకరకాల ఆఫర్లు ప్రకటించడంతో మెట్రోలో ప్రయాణించడానికి నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read: పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యం

మరోవైపు ట్రాఫిక్ ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో అదనంగా ప్రయాణికులు ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దేశంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఎక్కువ సంఖ్యలో జనాలు ప్రయణించడం విశేషం. మెట్రో ఉదయం 6.30 గంటల నుంచి చివరి రైలు రాత్రి 9.30 గంటల వరకు సేవలు అందిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో మెట్రోను ఆశ్రయించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బస్‌చార్జీలతో పోలిస్తే మెట్రో ఛార్జీలు ఎక్కువే అయినా ఇటీవల మెట్రో ఆఫర్లు ప్రకటించడంతో రైళ్లలో ప్రయాణానికి నగరవాసులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రోజు వారీ ప్రయాణికుల సంఖ్య 6.7 లక్షలు ఉండగా అధికంగా రోజుకు 1.40 లక్షల మంది ఐటీ, ఐటీ అనుబంధ రంగాల ఉద్యోగులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఆ తర్వాత విద్యార్థులు రోజుకు 1.20 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News