Monday, December 23, 2024

నగరవాసుల కోసం ఈ గ్యాలెరియా ప్రారంభించిన మెట్రో

- Advertisement -
- Advertisement -

Hyderabad Metro Rail Unveils e-Galleria

దేశంలో మొట్టమొదటి ఎక్స్‌క్లూజివ్, ఎలక్ట్రానిక్ టెక్నాలజీ మాల్

హైదరాబాద్: గ్రేటర్ నగర టెక్నాలజీ డిఎన్‌ఏకు అనుగుణంగా ఎల్ అండ్ టీ మెట్రో రైల్ తమ హైటెక్ సిటీ మాల్‌ను ఈ గ్యాలెరియాగా పునః ప్రారంభించింది. భారతదేశపు మొట్టమొదటి, ఎక్స్‌క్లూజివ్ ఎలక్ట్రానిక్ అండ్ టెక్నాలజీ మాల్‌గా హైటెక్ సిటీ వద్ద దీనిని పూర్తి సరికొత్త అవతార్‌లో తీర్చిదిద్దింది. నగర ఐటీ కేంద్రం నడిబొడ్డున ఉన్న ఈగ్యాలెరియా, టెక్నాలజీ ప్రేమికులైన నగరవాసుల సాంకేతికవసరాలను తీర్చే ఏకీకృత కేంద్రంగా నిలువనుంది. ఆకర్షనీయమైన స్కైవాక్‌తో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్‌కు అనుసంధానితమైన ఈగ్యాలెరియా, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన టెక్ అనుభవాలను మాల్‌లోని ప్రాంగణాలకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక లీజింగ్‌కు అందిస్తుంది. టెక్ ట్యాక్స్, రోడ్‌షోలు, ఉత్పత్తి ఆవిష్కరణలు నిలయంగా ఉండేలా దీనిని తీర్చిదిద్దారు.

వినోదాత్మకమైన, అనుసంధానిత వాతావరణంలో సాంకేతికత రంగంలో వస్తోన్న మార్పులను గురించి ప్రతి ఒకరూ ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈసందర్భంగా ఎల్ అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ, సీఈఓ కెవీబీరెడ్డి మాట్లాడుతూ మా ట్రాన్సిట్ ఆధారిత అభివృద్ది కోసం మావృద్ది ప్రణాళికలలో భాగంగా ఈ గ్యాలెరియాను ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. నేడు బ్రాండ్లన్నీ కూడా నూతన మార్కెటింగ్ ప్రాంగణాల కోసం వెదుకుతుండటంతో పాటుగా వినూత్నమైన ప్రొడక్ట్ ప్లేస్‌మెంట్స్ కోసం చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ అవసరాలన్నీ తీర్చే ఒక స్టాప్ కేంద్రంగా ఈ గ్యాలెరియా నిలువనుందన్నారు. ఈనూతన అవతార్ బ్రాండ్‌ల మద్దతు, లాయల్టీ వినియోగించడంలో మాకు సహాయనపడటంతో పాటుగా వ్యాపారసంస్దలు, హైదరాబాద్ నగరం కలిసి ఎదగడానికి , స్దిరమైన ఉజ్వల భవిష్యత్‌ను అభివృద్ది చేయడానికి మాకు అవకాశాన్ని అందిస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News