Monday, December 23, 2024

మెట్రో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెట్రో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కార్యాలయాలకు వెళ్ళే ఉద్యోగస్తులు, ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. సాంకేతిక సమస్య కారణంగా హైదరాబాద్ మెట్రో సేవలకు అంతరాయం కలిగినట్లు సమాచారం. నాగోల్ నుంచి రాయదుర్గం మార్గంలో సాంకేతిక సమస్యలలతో మెట్రో రైళ్లు 13 నిమిషాల పాటు పట్టాలపైన నిలిచిపోయాయి. బేగంపేటలో మెట్రో రైళ్లు 13 నిమిషాలు ఆగిపోయాయి.   రైళ్లు సకాలంలో రాకపోవటంతో మెట్రో ప్లాట్‌ఫాంపై ప్రయాణికులు భారీగా చేరుకుంటున్నారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో అయితే ఇసుకేస్తే రాలనంతగా ప్రయాణికులు ప్లాట్‌ఫాంపై నిరీక్షించారు. మెట్రో అధికారుల నుంచి ఎటువంటి సమాచారం ఇంకా బయటకు రాలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News