ఉదయం 7గంటల నుంచి రాత్రి 10.15 గంటల వరకు
ఆఖరి స్టేషన్‌కు 11.15 గంటలకు చేరుకోనున్న సర్వీసులు
హైదరాబాద్: మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో రైల్ సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం నుంచి మరో అరగంట పాటు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నేటి నుంచి రాత్రి వేళల్లో 10.15 గంటలకు చివరి మెట్రో సర్వీసు ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు రాత్రి 9.45 గంటల వరకు చివరి రైలు సర్వీసులు బయలుదేరిందని, ప్రయాణికుల సౌకర్దం మెట్రో రైళ్ల సమయాలను పొడిగించినట్లు వెల్లడించారు. సోమవారం నుంచి రైళ్లు ఉదయం 7గంటల నుంచి రాత్రి 10.15 గంటల వరకు సర్వీసులు నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చివరి రైల్ 10.15 గంటలకు బయలుదేరి ఆఖరి స్టేషన్‌కు రాత్రి 11.15 గంటలకు చేరుకుంటుందన్నారు. ప్రతి రోజు మూడు మార్గాల్లో వెయ్యి ట్రిప్పులు సర్వీసులు నడిపిస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా రైల్‌లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సర్వీసులు నడుపుతున్నట్లు, ప్రయాణికులు ముఖానికి మాస్కులు, శానిటైజర్ వినియోగించాలని, మెట్రో సిబ్బందికి సహాకరించాలని కోరారు.