జూబ్లీహిల్స్, అమీర్‌పేట మార్గంలో 15 నిమిషాలు నిలిచిన రైలు
మెట్రో అధికారుల తీరుపై ప్రయాణికుల సంతృప్తి
హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రోకు సాంకేతిక కష్టాలు తరుచూ ఇబ్బందులు గురిచేస్తున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా రైల్‌లు నిలిచిపోవడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న అప్పడప్పుడు అగిపోవడం నగర వాసుల నుంచి విమర్శలు తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 5వ తేదీన అసెంబ్లీ నుంచి అమీర్ పేట వెళ్లే మార్గంలో 20 నిమిషాల పాటు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడేలా చేసింది. తాజాగా బుధవారం మెట్రో రైలు సేవలు మరోసారి నిలిచిపోయాయి. అమీర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ బస్‌స్టేషన్ వెళ్లుతుండగా మార్గమద్యంలో 15 నిమిషాల పాటు మెట్రో రైలు నిలిచిపోయింది.
సాంకేతిక సమస్య రావడంతో కారణంగా అధికారులు చెబుతున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది హైటెక్ సిటీ నుంచి జూబ్లీహిల్స్ వరకు వచ్చిన రైల్లో ప్రయాణికులు దింపేశారు. ఆగిపోయిన రైల్ ను తీసుకువచ్చేందుకు అధికారులు మరో ట్రైన్‌ను పంపారు. గతంలోనూ మెట్రో రైళ్లలో పలుసారు సాంకేతిక సమస్యలు వచ్చాయి. తరుచు రైళ్లు సాంకేతిక సమస్యలు రావడంత ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగి వాతావరణంలో దుమ్ము, దూళి కాలుష్యం పెరగడంతో ఒక్కసారిగా మెట్రో రైళ్లు దూసుకెళ్లే మార్గంలో రెడ్‌లైట్లు వెలుగుతున్నాయి. దీంతో కొన్నిసార్లు మెట్రో రైళ్లు అకస్మాత్తుగా నిలిచిపోతున్నట్లు మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో సాంకేతిక సమస్యలు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని వెల్లడిస్తున్నారు.
Hyderabad metro train stopped due to technical issues