ఉదయం 7 గంటలకు మొదటి సర్వీసు ప్రారంభం
11.45 గంటలకు చివరిరైల్ ప్రారంభమై 12.45 ఆఖరి స్టేషన్‌కు
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరానికి మణిహారంగా నిలిచి మెట్రోకు కరోనా వైరస్ బంధంగా మారింది. మెట్రో ప్రారంభం నుంచి రోజుకు లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్దానాలకు చేర్చుతూ ప్రభుత్వ నుంచి ప్రజలు ప్రశంసలు అందుకుంది. మెట్రో లాబాల బాటలో వెళ్లే సమయంలో వైరస్ విజృంభణ చేయడంతో గత సంవత్సరంలో లాక్‌డౌన్ విధించడంతో ఐదు నెలల పాటు పట్టాలెక్కకుండా డిపోలోనే సర్వీసు నిలిచిపోయాయి.తరువాత సెప్టెంబర్ మాసంలో కోవిడ్ అంక్షల మధ్య పునః ప్రారంభం కావడంతో మెట్రో గాడిన పడిందని అధికారులు బావించి, పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఆదరించేందుకు కొత్తగా సువర్ణ ఆఫరు తీసుకొచ్చి లాభాలు చూస్తుండగా మళ్లీ కరోనా సేకండ్ వేవ్ దెబ్బకొట్టింది. మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేయనున్న నేపథ్యంలో మెట్రో రైలు సర్వీసు వేళ్లలో మార్పులు చేశారు.
నగరంలోని టెర్మినల్ మెట్రో స్టేషన్ల నుంచి ఉదయం 7గంటల మొదటి రైలు ప్రారంభమైతుందని, చివరిరైలు 11.45 గంటల బయలు దేరి ఆఖరి స్టేషన్‌కు 12.45 గంటలకు చేరుకుంటుందని మెట్రో అధికారులు తెలిపారు. మెట్రో రైలు ప్రయాణికులు కరోనా నిబంధనలు పాటిస్తూ సిబ్బందికి సహకరించాలని హెచ్‌ఎంఆర్ కోరింది. భౌతికదూరం పాటించడం మాస్కులు ధరించడంతో పాటు ఎప్పటికప్పడు చేతులు పరిశుభ్రం చేసుకోవాలని సూచించింది.అదే విధంగా మెట్రో స్టేషన్ల పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసి,ప్రయాణికులు మాస్కులు ధరించేలా చూస్తూ థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాత లోపలికి అనుమతిస్తున్నట్లు పేర్కొంది. రైళ్లలోకి వెళ్లగా మార్కింగ్ చేసిన చోట కూర్చోవాలని, నిలబడాలని ప్రకటన చేస్తూ ప్రయాణికుల మధ్య బౌతిక దూరం పాటించేలా సిబ్బంది చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.