Monday, December 23, 2024

మెట్రో నగరాల్లో ప్రగతి పథంలో దూసుకుపోతున్న నగరం

- Advertisement -
- Advertisement -

 

Hyderabad more developed

మన తెలంగాణ/సిటీ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర రాజధాని, ఈ ప్రాంత గుండె కాయ అయిన హైదరాబాద్ విశ్వనగరంగా దీశగా వడివడిగా అడుగులు వే స్తోంది. స్వరాష్ట్ర ఏర్పడిన తర్వాత ఈ 8 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దేశంలోని మెట్రో నగరాల్లో అత్యంత వేగంగా ప్రగతి పథంలో గ్రేటర్ హైదరాబాద్ దూసుకువెళ్లుతోంది. 25 అసెంబ్లీ, 5 పార్లమెంటరీ నియోజకవర్గాలు, 4 రెవెన్యూ జిల్లాల పరిధిలో 625 చ.కిలో మీ టర్లలో విస్తీరించి ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 150 వా ర్డుల్లో సుమారు కోటి మంది (10 మిలియన్) జనాభాకు అత్యుత్తమ సేవాలను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వంలోని వివిధ సంస్థల ద్వారా ఉత్తమ అవార్డులను అ ందుకుంటోంది. వేల కోట్ల వ్యయంతో అభివృద్ది కార్యక్రమాలతో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, సౌకర్యాలను కల్పించడంతో పాటు అంతే మొత్తంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నగరంలోని బడుగు, బలహీన వర్గాల ఆర్ధికాభివృద్ధికి తోడ్పాటును అందించడమే కాకుండా ఆసరా పెన్షన్లతో వయో వృద్ధ్దుల కు ఆర్ధిక భరోసా కల్పిస్తూ ఈ ప్రభుత్వం కుటుంబ పెద్ద పాత్రను పోషిస్తోంది.

Minister KTR will inaugurate shaikpet flyover tomorrow
సిగ్నల్ రహిత రహదారులే లక్షం : దేశంలో ఏ నగరంలోని విధంగా ఎస్‌ఆర్‌డిపి అనే సరికొత్త ప్రాజెక్టు రూపొందించి తద్వారా పద్మ వ్యూహాం లాంటి ట్రాఫిక్ చక్రబంధాన్ని చేధిస్తూ సిగ్నల్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు రూ.29, 695 కోట్ల వ్యయంతో సిటిలోని ప్రదాన ప్రాంతాల్లోని 54 జంక్షన్లలో ఎలివేటేడ్ కారిడా ర్లు.., గ్రేడ్ సపరేటర్ల.., స్కైవేల నిర్మాణానికి జిహెచ్‌ఎంసి శ్రీకారం చుట్టింది. ఇం దులో భాగంగా మొదటి దశ కింద 8,092 కోట్లు మొత్తం 47 ప్రాజెక్టును చేపట్టగా ఇందులో 29 ప్రాజెక్టులు ప్రజలకు అందుబాటులోకి రాగా, మరో రెండు ప్రాజెక్టులు ఈనెలలో ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి. వీటితో పాటు మిస్సింగ్ లింక్ రోడ్ల ద్వారా ప్రజలు ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర పురపాలక ప ట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ దిశా నిర్దేశనంలోమిస్సింగ్, లింక్ రోడ్లను చేపడుతున్నారు. ఈ లింక్ రోడ్లు ప్రత్యామ్నాయ మార్గాలుగా భవిష్యత్తులో హైదరాబాద్ అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రో డ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌ఆర్‌డిసిఎల్) ద్వారా మొదటి దశలో 24 కిలోమీటర్ల లింక్ రోడ్డు మిస్సింగ్ రోడ్లు చేపట్టేందుకు రూ. 273.617 కోట్ల అం చనా వ్యయంతో చేపట్టగా 21 పనులు చేపట్టగా అందులో 16 పనులు పూర్తి కా గా మిగితా 5 పనులు వివిధ ప్రగతి దశలో కలవు.రెండోవ దశలో రూ. 158.48 కోట్ల అంచనా వ్యయంతో 8 పనుల ద్వారా 15.88 కిలోమీటర్ల మిస్సింగ్ లింక్ రోడ్డు ను చేపట్టగా 5 పనులు జూన్, 2022 వరకు మిగితా మూడు పనులు న వంబర్ వరకు పూర్తి అవుతాయి మరొక 12 .48 కిలోమీటర్ల రోడ్డు 140.08 కోట్ల అంచనా వ్యయంతో 8 పనులు టెండర్ దశ లో కలవు.గ్రేటర్ పరిధిలో రూ.127 .35 కోట్ల వ్యయంతో పాదచారుల సౌకర్యం కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు జిహెచ్‌ఎంసి చేపట్టింది. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ వలన సామాన్య ప్రజలు నడవాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం ప్రజల అవసరాలను గుర్తించి జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలు కల్పించే నేపథ్యంలో 21ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలను చేపట్టారు.

Police Restrictions on Durgam Cheruvu Cable Bridge
అంతర్జాతీయ స్థాయి రోడ్ల నిర్వహణ : రోడ్లను ప్రయాణం సాఫిగా జరగాలంటే వాహనాలు ఉంటే సరిపోదు… దానికి తగ్గట్టుగా రోడ్లు ఉండాలి. జిహెచ్‌ఎంసి పరిధిలో 9013కిలో మీటర్ల రోడ్లను మేయింటనెన్స్ చేస్తున్నది. అందులో 2846 కి లో మీటర్ల బ్లాక్ టాప్ (బి.టి) రోడ్లు కాగా 6167 సిమెంట్ రోడ్లు కలవు ఈ రో డ్లలో 526 కిలో మీటర్ల రోడ్లు 4 లైన్లు , ఆ పైన లైన్ల రోడ్లు కలవు. ఈ నేపథ్యంలో 9013 కిలో మీటర్ల ప్రధాన బి.టి రోడ్లలో (సిఆర్‌ఎంపి) పథకం ద్వారా 709. 49కిలో మీటర్ల ప్రజా రవాణా మెరుగుపడే ప్రధాన రోడ్డును రూ. 1839 కోట్ల అ ంచనా వ్యయంతో 5 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను అప్పజెప్పారు. ఈ రోడ్ల నిర్మాణం 3 లేన్ల , ఎక్కువ వెడల్పు గల రోడ్లను 7 ప్యాకేజీలో 401 స్ట్రే చేస్ 5 స ంవత్సరాలు నిర్వహణ చేసే విధంగా ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. ఈ ఏజెన్సీ ఫు ట్ పాత్, సెంట్రల్ డివైడర్లు, నిర్మాణాలు, కర్బ్ పెయింటింగ్, లైన్ మార్కింగ్, గ్రీనరి మేయింటనెన్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 468.663 కిలో మీటర్ల బిటి రోడ్ల నిర్మాణం చేపట్టగా రూ. 554.74కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మిగితా లక్ష్యాన్ని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తారు. రోడ్ల నిర్వహణలో బాగంగా ప్రజల నుండి ఫిర్యాదు స్వీకరించేందుకు సంబంధిత ఏజెన్సీ జోనల్ వారికి కంట్రోల్ రూ ంను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ప్రజల నుండి అందిన ఫిర్యాదుల మేరకు 15,458 గుంతలను మరమ్మత్తు చేపట్టారు.

మల్టీ పర్పస్ స్పోర్ట్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్స్ : క్రీడల ప్రోత్సాహానికి గ్రే టర్ పరిధిలో గల క్రీడా మైదానాలు, క్రీడా ప్రాంగణాలను పూర్తిస్థాయి అభివృద్ది పర్చడం ద్వారా క్రీడాకారులకు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. సంప్రదాయ, ఆధునిక ఆటలకు సామర్థ్యాన్ని నైపుణ్యత మె రుగు పరచడం కోసం ఖర్చుకు వెనుకాడకుండా ఆధునిక వసతులను సమకూర్చి క్రీడాభివృద్ధికి దోహదపడే విధంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రీడల అభివృద్ధికి సుమారు రూ. 87 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 19 వివిధ ర కాల అభివృద్ధి పనులను చేపట్టగా ఇందులో ఇప్పటికే 8 పనులు పూర్తి చేసి వాటిని అందుబాటులోకి తీసుకురాగా. మిగిలిన పనులు వివిధ ప్రగతి దశలో ఉన్న వా టిని త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా క్రీడ ప్రాంగణాలు ద్వారా ఆదాయ వనరుల ను కూడా సమకూర్చుకుంటోంది. ముఖ్యంగా నెలసరి సభ్యత్వం, పే, ప్లే ద్వారా స్కూల్ రిజిస్ట్రేషన్ ద్వారా, ఈ సంవత్సరం లో ఇప్పటి వరకు రూ.90 లక్షల కు పైగా ఆదాయం వచ్చింది. క్రీడల ప్రోత్సహాంలో భాగంగా గత ఏడాది ప్రతివార్డుకు రెండు లక్షల విలువ గల క్రీడా పరికరాలను అందజేయడమేకాకుండా. ఈ వేసవి కాలంలో 6 సంవత్సరాల వయస్సు నుండి 16 సంవత్సరాల వయస్సు గల వారికి సమ్మర్ కో చింగ్ సెంటర్ లను నిర్వహించ నున్నారు తద్వారా సాంప్రదాయ ,ఆధునిక క్రీ డల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతున్నది.

Kompally IT Park more developed
చార్మినార్ పెడేస్టే రియన్ ప్రాజెక్టు : ప్రపంచ ప్రఖ్యాత గాంచిన చార్మినార్ మ రింత పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి 35 .10 కోట్ల వ్యయంతో వి వి ధ పనులను చేపట్టారు. 220 మీటర్ల రేడియస్‌లో చుట్టూ ప్రక్కల ప్రాంతంలో మరింత ఆకర్షణీయంగా కనబడేలా కొన్ని సౌకర్యాలను కల్పించారు. ఈ ప్రాజె క్టు లో భాగంగా 60 కోట్ల అంచనా వ్యయం తో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. అదే విధంగా అప్పటికీ ఇప్పటికీ ప్రపంచ పటంలో దాని ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్న హైదరాబాద్ నగర పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు చా రిత్రాక కట్టడాల పరిరక్షణకు ప్రభుత్వ నడుం బిగించింది. ప్రభుత్వ సంకల్పాని కి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రితోపాటు, ప్రిన్సిపల్ సెక్రటరి శ్రీ అర్వి ంద్ కుమార్, ఐ.ఏ.ఎస్, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఈ కార్యక్రమాన్ని దాని భుజాల మీదికి తీసుకుని ఇప్పుడు దిగ్విజయంగా పూర్తి చేసింది. 85 ఏళ్లకు పైగా నిర్విరామంగా సేవలందించిన మోజహి మార్కెట్ క్లాక్ టవర్ భవనం వారసత్వ సంపద చెక్కుచెదరకు ండా మరికొన్ని శతాబ్దాలు దీటుగా నిలిచే విధంగా తీర్చిదిద్దారు.
మోడల్ మార్కెట్లు, ఫిష్ మార్కెట్లు : ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నగరంలో అనేక అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా కనీస అవసరాలైనా స్వచ్ఛమైన నాణ్యమైన మాంసం, చేపలు, తాజా కూరగాయాలను అందించేందుకు మోడల్ మార్కెట్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. అందులో భాగ ంగా జిహెచ్‌ఎంసి అధ్వర్యంలో రూ.19.40 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో 5 ఫిష్ మార్కెట్లను చేపట్టింది. అందులో నాచారం, కూకట్ పల్లి మార్కెట్ ల ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మల్లాపూర్, బేగంబజార్ రెండు పనులు పురోగతిలో ఉన్నాయి. నారాయణగూడలో పాత మునిసిపాలిటీ కూరగాయల మార్కెట్ ను రూ. 4 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మోడల్ మార్కెట్ నిర్మాణం చేపట్టగా అట్టి పని పురోగతిలో ఉంది. త్వ రలో పూర్తి చేసి ప్రజలకు అందబాటులోకి తేనున్నారు.
ఎస్‌ఎన్‌డిపితో నాలాల అభివృద్ధ్ది : నగరంలో నెలకొన్న ముంపు సమస్యకు శాశ్వతంగా పరిష్కారించేందుకు ఎస్‌ఎన్‌డిపి కింద నగరంలోని వరదనీటి నాలాల అ భివృద్ధ్దికి జిహెచ్‌ఎంసి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.858 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాధాన్యత గల మొత్తం 60 ప నులను మంజూరు చేశారు జిహెచ్‌ఎంసి పరిధి గల నాలాలకు అనుబంధంగా ఉన్న చుట్టూ ప్రక్కల మునిసిపాలిటీ లలో కూడా నాలాలను కూడా చేపట్టారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 37 పనులు ఇతర మున్సిపాలిటీ లలో 23 పనులు చేపట్టా రు. చేపట్టిన 60 పనుల వచ్చే వర్ష కాలం వరకు పూర్తి చేస్తారు తద్వారా భవిష్యత్తులో వరద నీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం అవుతుంది. జిహెచ్‌ఎంసి పరిధిలో సికింద్రాబాద్ జోన్‌లో 8 పనులు, ఖైరతాబాద్ జోన్ లో 7 ప నులు, ఎల్ బి నగర్ జోన్ లో 10 పనులు ,కూకట్ పల్లి జోన్ లో 3 , చార్మినార్ జోన్ లో 7, శేరి లింగంపల్లి 2 పనులు చేపట్టారు . చుట్టుప్రక్కల మున్సిపాలిటీ లలో 23 పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేస్తారు.
ఆర్యోగానికి పెద్దపీట : నగరంలోని నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను అ ందించేందుకు ఆరోగ్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భా గంగా గ్రేటర్ పరిధిలో ఇప్పటీకే 263 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా 100కు పైగా రోగ నిర్ధారణ పరీక్షలను నిర్వహించడంతో పా టు ఉచిత మందులను అందజేస్తున్నారు. అంతేకాకుండా నగరంలో నలూమూలాల సూపర్ స్పెషలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇటీవలే శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నగరంలోని ప్రధాన ఆసుపత్రులో చికిత్స పొందుతున్న రోగుల సహాయాలకు కేవలం రూ.5 ఖర్చుతో మూ డు పూటాల భోజనం సౌకర్యం కల్పించడమే కాకుండా వారికి అత్యాధునిక సౌకర్యాలతో నైట్ షెల్టర్లును సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
స్వచ్ఛ హైదరాబాద్ కు విశేష కృషి : కోటి మంది నివసిస్తున్న గ్రేటర్ హైదరాబాద్‌ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడంలో జిహెచ్‌ఎంసి ఎనలేని కృషి చే స్తోంది. ప్రతి రోజు 18వేల మంది పారిశుద్ధ్ద కార్మికులను నగరాన్ని పరిశుభ్ర పర్చుతుండగా, గ్రేటర్ వ్యాప్తంగా ప్రతి రోజు ఉత్పత్తి అవుతున్న సుమారు 7 వేల మెట్రిక్ టన్నుల చెత్తను అత్యాధునిక పద్ధతిలో డంపింగ్ యార్డుకు తరలిస్తూ పర్యావర ణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా నగరంలో వెలువడుతున్న వ్య ర్థాల నుంచి జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో పోడి చెత్త నుంచి విద్యుత్, తడి చెత్త నుంచి ఎరువులను ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాకుండా శరవేగంగా విస్తరిస్తు న్న హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు 2వేల మెట్రిక్ టన్నుల మేర నిర్మాణ వ్య ర్థాలు వెలువడుతుండగా వాటిని రిసైక్లింగ్ చేసేందుకు ప్రత్యేకంగా సి అండి డి ప్లాంట్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా గృహనిర్మాణ రంగానికి అవసరమై ఇసుక, కంకర తదితరాలను పునర్ ః ఉత్పత్తి చేయడం ద్వారా భావి తరాలకు సహాజ వనరుల అందించేందుకు కృషి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News