Wednesday, January 22, 2025

విజయ పథంలో హైదరాబాద్ అభివృద్ధి: మేయర్

- Advertisement -
- Advertisement -

విజయ పథంలో హైదరాబాద్ అభివృద్ది
ఏడాది పదవి కాలం పూర్తి సంతృప్తినిచ్చింది: మేయర్ గద్వాల విజయలక్ష్మి

Hyderabad more developed in Telangana

మన తెలంగాణ/సిటీ బ్యూరో: తెలంగాణ ఆవిర్భావం తర్వాత దేశంలోనే అతి పెద్ద దైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా మేయర్ గద్వాల విజయలక్ష్మి నేతృత్వంలో హైదరాబాద్ అభివృద్ది పథంలో దూసుకుపోతోంది. జిహెచ్‌ఎంసి మేయర్‌గా గత ఏడాది ఫిబ్రవరి 12న బాధ్యతలను స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి రేపటితో ఏడాది పదవి కాలం పూర్తి కానుంది. ఈ శుభ సందర్భంగా తన మీద ఎంతో నమ్మకంతో మేయర్‌గా బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు, నగర అభివృద్దికి ఎప్పటీకప్పుడు దిశా నిర్దేశనం చేస్తూ తనను ముందుకు నడిపిస్తున్న పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తన విధి నిర్వహణల్లో అన్ని విధాలుగా సహాకరించిన గ్రేటర్ ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డిప్యూటీ మేయర్ , కార్పొరేటర్లకు అధికారులకు విజయలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తన ఏడాది పాలనలో సాధించిన విజయాలను మన తెలంగాణకు మేయర్ విజయలక్ష్మి వివరించారు.

ప్రశ్న: ఏడాది పాలన ఏలా సాగింది అనుకుంటున్నారు ?

మేయర్: గ్రేటర్ హైదబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఏడాది పరిపాలన పూర్తిగా విజయవంతంగా సాగింది. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ పూర్తి సహాయ, సహకారాలతో గ్రేటర్ హైదరాబాద్‌ను అభివృద్ది పథంలో తీసుకు వెళ్లగలిగాం. అభివృద్దిలో భాగంగా పలు అతి ముఖ్యమైన ప్రాజెక్టులను అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రాగలిగాం. ఇందుకు సిఎం కెసిఆర్‌తో పాటు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.

ప్రశ్న: నగరంలో పచ్చదనానికి చేస్తున్న కృషి ఏమిటి ?

మేయర్: గ్రేటర్‌ను పూర్తిగా హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ మాసన పుత్రికైన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నాం. తద్వారా నగరంలో వాయు కాలుష్యాన్ని చాల మేరకు తగ్గించి నగరవాసుల జీవన ప్రమాణాల మెరుగుపర్చడమే కాకుండా ఆరోగ్యనగరంగా తీర్చిదిద్దుతున్నాం. 2021లో నగరంలో 1.2 కోట్లు మొక్కలు నాటేందుకు లక్షంగా నిర్దేశించుకోగా, లక్షానికి మించి1.23 కోట్ల మొక్కలు నాటడం, పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిహెచ్‌ఎంసి బడ్జెట్‌లో 10 శాతం గ్రీనరీకి ఖర్చు చేస్తున్నాం. గ్రేటర్‌లో 4856 కాలనీలు బస్తీలు ఉండగా, ఇందులో 900 కాలనీలను పూర్తిగా హరిత కాలనీలుగా తీర్చిదిద్దాం మిగిలిన వాటిని సైతం పూర్తి చేస్తాం. అంతేకాకుండా పెద్దసంఖ్యలో పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా అవెన్యూ,యాద్రాది మోడల్ ప్లాంటేషన్‌ను చేపట్టడంతో పాటు 3 అర్భన్ ఫారెస్ట్ పార్కులను సైతం అందుబాటలోకి తెచ్చాం. వీటితో పాటు థీమ్ పార్కులను సైతం ఏర్పాటు చేస్తున్నాం.

ప్రశ్న: నగర నిరుపేదలకు డబుల్ ఇళ్ల ఎప్పట్లోగా అందించబోతున్నారు ?

మేయర్: నగరంలోని నిరుపేదల సొంతింటి చిరుకాల స్వప్నం త్వరలో నేరవేర్చబోతున్నాం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పేదలకు పైసా ఖర్చులేకుండా సకల సౌకర్యాలతో డబుల్ ఇళ్లను అందింస్తున్నాం. గ్రేటర్ వాసుల కోసం లక్షా డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఇప్పటీకే 65 వేల ఇళ్లు పూర్తి అయ్యాయి. ఇందులో 5 వేల ఇళ్ల పంపిణీ కూడా చేశాం. కొల్లూరు అతిపెద్ద టౌన్ షిప్‌లో 117 బ్లాక్‌ల్లో చేపట్టిన 15,600 డబుల్ ఇళ్ల నిర్మాణం పూరైయ్యాయి. వీటిని త్వరలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చేతుల మీదగా పేదలకు అందజేయనున్నారు. మిగిలిన ఇళ్లు నిర్మాణం సైతం అతిత్వరలో పూర్తి చేస్తాం.

ప్రశ్న: నగరంలో నెలకొన్న పద్మవ్యూహాం లాంటి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఏలాంటి చర్యలు తీసుకున్నారు ?

మేయర్: నగరంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పూర్తిగా పరిష్కరించడమే లక్షంగా ఎస్‌ఆర్‌డిపి ద్వారా అనేక ప్రాజెక్టులను చేపడుతున్నాం. ఇందులో భాగంగా మొదటి దశ కింద పలు ప్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ది, అండర్ పాస్‌లు, ఆర్‌ఓబిలు, ఆర్‌యుబిలు, మేయర్ రోడ్లతో పాటు లింక్ రోడ్ల అభివృద్దిని చేపట్టాం. తద్వారా ఇప్పటీ వరకు నగరంలో 50 శాతానికి పైగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించగలిగాం. కేవలం ఏడాది కాలంలోనే ఎస్‌ఆర్‌డిపి కింద చేపట్టిన 22 ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చాం. ఇందులో అతిముఖ్యమైన మేజర్ ప్రాజెక్టులు, బాలానగర్, షేక్‌పేట్, మింథానివద్ద అబ్దుల్ కలాం ప్లై ఓవర్లను అతి తక్కువ కాలంలో పూర్తి చేసి ప్రజలకు అంకింత చేశారు. అదేవిధంగా పాదచారుల కోసం గ్రేటర్ వ్యాప్తంగా రూ.128 కోట్ల వ్యయంతో 21 పుట్ ఓవర్ బ్రిడ్జిలను చేపట్టాం. ఇందులో ఇప్పటీకే 4 పూర్తి కాగా, మరో 14 పుట్ ఓవర్ బ్రిడ్జిల పనులు కొనసాగుతున్నాయి.

ప్రశ్న: గతంలో కన్న భిన్నంగా రోడ్ల నిర్వహణకు తీసుకున్న చర్యలు ఏమిటి ?

మేయర్: నగరంలో ప్రధాన రోడ్లను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిర్వహించేందుకు గాను సమగ్ర రోడ్ల నిర్వాహణ ప్రాజెక్టు(సిఆర్‌ఎంపి)ని అమలు చేస్తున్నాం. ఇందులోభాగంగా నగరంలోని 6 జోన్లలో 7౦9 కిలో మీటర్ల మేర ప్రధాన రహదార్లను రూ.1839 కోట్ల వ్యయంతో 5 ఏళ్లపాటు నిర్వహించేందకు గాను 7 ప్రైవేట్ సంస్థలకు అప్పగించం. దీంతో నగరంలో రోడ్ల నిర్వహణ చాల మెరుగుపడింది. ఇందులో ఇప్పటికే 468 కిలో మీటర్ల మేర రోడ్ల మరమ్మతులు చేపట్టిడంతో పాటు రోడ్ల పోడవున లైనింగ్, క్రాసింగ్ లైన్లు వేయడంతోపాటు రోడ్ల మధ్యలో గ్రీనరీ పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఒక్కడ చిన్న గుంత పడ్డ యుద్ద ప్రతిపాదికన పూడ్చివేయడం, ఈ ఏడాది 1670 గుంతలను సకాలం పూడ్చడం జరిగింది. దీంతో గత వర్ష కాలంలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణ సాఫీగా సాగింది.

ప్రశ్న: నగరం వరద ముంపుకు గురికాకుండా తీసుకుంటున్న చర్యలు ఏమిటి ?

మేయర్ ః గత ఏడాది కురిసిన భారీ ఆకాల వర్షాల నేపథ్యంలో నగరం ముంపు గురైన నేపథ్యంలో ఏడాది అలాంటి సమస్యలు తలెత్తకుంగా ఎస్‌ఎన్‌డిపి ద్వారా నాలాల అభివృద్దిని చేపట్టాం. ఇందుకు మొదటి దశ కింద ప్రభుత్వం విడుదల చేసిన రూ.858 కోట్లవ్యయంతో 52 పనులు చేపడుతున్నాం. ఇందులో ఇప్పటికే 32 పనులకు టెండర్లు పూర్తికాగా 17 పనులు మొదలైయ్యాయి. రానున్న జూన్ నాటికి ఈ మొత్తం 52 పనులను పూర్తి చేస్తాం దీంతో నగర ముంపు సమస్య చాల మేరకు పరిష్కారం కానుంది. నాలా పనులు యుద్ద ప్రతిపాదికన జరుగుతున్నాయి. ఇందులోభాగంగా నాలా అభివృద్ది పనులతో ప్రభావితం కానున్న పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఇళ్ల కొల్పోతున్న వారికి ప్రత్యామ్నాయంగా డబుల్ ఇళ్లను కేటాయించి వారిని అక్కడి నుంచి తరలిస్తాం. అదేవిధంగా నాలాల వద్ద ప్రమాదాలు, దురదృష్ణ కరణ చోటు చేసుకోకుండా అన్ని రకాలుగా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు సంబంధించి ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశించారు.

ప్రశ్న: బస్తీ దవఖానాలు ఏవిధంగా పని చేస్తున్నాయి.

మేయర్: నగరంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు చాల అద్భుతంగా పని చేస్తున్నాయి. పేదలకు ఇవి అందుబాటులోకి వచ్చిన తర్వాత వైద్య ఖర్చులు చాల మేరకు తగ్గాయి. దాదాపుగా 100కు పైగా వైద్య పరిక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహిచడమే కాకుండా పూర్తి ఉచితంగా మందులు అందజేస్తున్నారు. దీంతో రోగాన్ని ముందుగానే గుర్తించి పెద్ద ఆసుపత్రులకు పంపిస్తుండడంతో అతి త్వరగా ఆరోగ్యవంతులుగా తిరిగివస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా ప్రతి డివిజన్‌కు రెండు చోప్పున 300 బస్తీ దవాఖానాల ఏర్పాటు లక్షంగా నిర్దేశించుకోగా ఇప్పటీకే 253 అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన వాటిని కూడా త్వరలో ప్రారంభించనున్నాం. అయితే బస్తీ దవాఖానాల ద్వారా మెరుగైన సేవలను అందుతుండడంతో వీటి సంఖ్యను మరింత పెంచాలని ప్రభుత్వాన్ని కోరాం. అందుకు సానుకూలత వ్యక్తం చేశారు.

ప్రశ్న: నగరంలో పారిశుద్ద పరిస్థితి ఏవిధంగా ఉంది ?

మేయర్: గతంతో పోల్చితే నగరంలో పారిశుద్దం చాల మేరకు మెరుగు పడింది. అయితే నగర పరిశుభ్రతలో నగరవాసులు సైతం తమ వంతు పాత్ర పోషించాలి. అప్పుడే నగరం మరింత పరిశుభ్రంగా ఉంటుంది. కరోనా సమయంలో కూడా సిబ్బంది అంకిత భావంతో పని చేసి నగరవాసులకు మెరుగైన సేవలను అందించారు. ఈ ఫ్రంట్‌లైన్ వారియర్స్ అందరికీ ధన్యవాదాలు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News