Monday, December 23, 2024

నగరంలో మళ్లీ వరుస హత్యలు

- Advertisement -
- Advertisement -

రౌడీషీటర్లపై పోలీసుల నిఘా కరువు
కౌన్సెలింగ్ లేకపోవడంతో హత్యలు చేస్తున్న రౌడీషీటర్లు
ఇన్‌ఛార్జ్ ఎసిపిల ప్రేక్షకపాత్ర

Man Murdered in Anantapur

మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలో మళ్లీ హత్యలు వరుసగా జరుగుతున్నాయి. చిన్నచిన్న తగాదాలకు నిందితులు హత్యలు చేస్తున్నారు, ముఖ్యంగా పాతబస్తీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. చాలా హత్యల విషయంలో పాతకక్షలను మనసులో పెట్టుకుని హత్యలు చేస్తున్నారు. హత్య జరుగుతున్న వాటిల్లో ఎక్కువగా రౌడీషీటర్ల పాత్ర ఉం టోంది. గతంలో రౌడీషీటర్లపై పోలీసులు నిరంతరం ని ఘా పెట్టేవారు, వారి రోజు వారీ కార్యకలాపాలను పరిశీలించేవారు. వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్‌కు పలిపించి కౌన్సెలింగ్ ఇచ్చే వారు, వినకుండా ప్రవర్తించే వారిపై పిడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించేవారు. కాని గత కొంత కాలం నుంచి నగర పోలీసులు రౌడీషీటర్లపై నిఘా పెట్టకపోవడంతో వారు రెచ్చి పోతున్నారు. గతంలో తమతో గొడవలు పెట్టుకున్న వారిని టార్గెట్‌గా చేసుకుని హత్యలు చేస్తున్నారు.

బహదుర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా హత్యలు జరుగుతున్నాయి. తమ సోదరిని వేధిస్తున్నాడని కక్ష పెంచుకున్న బావను హత్య చేశాడు, బావమర్ది, ఇందులో నిందితులు,బాధితుడిపై గతంలో పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. ఈ కేసులో నిందితుడు ముందుగానే హత్య చేస్తానని బాధితుడి కుటుంబ సభ్యులకు చెప్పి మరీ చేశారు. ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితులుగా రౌడీషీర్లు ఉన్నారు. పాతకక్షల నేపథ్యంలో బాధితుడిని హత్య చేశారు. రెండు రోజుల వ్యవధిలోని బహదుర్‌పుర పోలీస్ స్టేషన్‌లో రెండు హత్యలు జరిగాయి. ఇలాంటి ప్రాంతాల్లో పోలీసులు రౌడీషీటర్లపై నిరంతరం నిఘాపెట్టాల్సిన అవసరం ఉంది, కానీ వారు పట్టించుకోకపోవడం వల్లే యథేచ్చగా హత్యలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12వ తేదీన రోటీ మేకర్‌గా పనిచేస్తున్న ఫేక్ ఫరీద్‌ను పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఆటోలో గొంతు కోసి హత్య చేశారు. గతంలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఎసిపిలను పూర్తి స్థాయిలో నియమించేవారు. ఇప్పుడు పాతబస్తీ ఏరియాలో పనిచేస్తున్న అందురు ఏసిపిలు ఇన్‌ఛార్జ్‌లే కావడంతో కఠినంగా వ్యవహరించడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తామకు ఎప్పుడు బదిలీ అవుతుందో చెప్పలేమని, ఈ సమయంలో తాము ఎందుకు రిస్కు తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. పూర్తిస్థాయి అధికారులను నియమిస్తే శాంతిభద్రతలు అదుపులోకి వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కరోనా తర్వాత…

man was brutally murdered in Kaithalapur

కరోనా సమయంలో వరుసగా రెండు లాక్‌డౌన్‌లో విధించడంతో ఎక్కడి వారు వారి ఇళ్లల్లోనే ఉండిపోయారు. మొదటి లాక్‌డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత వరుసగా నగరంలో హత్యలు జరిగాయి. చిన్ని కారణాలతో, మధ్యం మత్తులో నిందితులు నడిరోడ్డుపై అందురు చూస్తుండగా హత్యలు చేశారు. తమ సోదరిని వేధింపులకు గురిచేస్తున్నాడని ఆటో డ్రైవర్‌ను యువతి సోదరుడు కత్తితో నడి రోడ్డుపై గొంతుకోసి హత్య చేశాడు. ఇది చూసిన చాలామంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అప్పటి నుంచి వరుసగా నగరంలో హత్యలు జరిగాయి. తర్వాత ఇప్పడు మళ్లీ అలాగే హత్యలు జరుగుతున్నాయి.

చాలా రోజులకు లాఠీలు వచ్చాయి…

ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ఇంత కాలం పోలీసులు చేతులు కట్టేసిన పై అధికారులు, వారు ఏ పనిచేయకుండా, నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించకుండా చేశారు. కానీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నెమ్మదిగా మార్పు తీసుకుని వస్తున్నారు. నేరస్థుల విషయంలో ఫ్రెంఢ్లీ పోలీసింగ్ లేదని కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇది చెప్పడమే కాకుండా పోలీసులు చేతికి చాలా రోజుల తర్వాత లాఠీలు అందించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు చాలా ఏళ్ల తర్వాత తమ చేతికి లాఠీ లు వచ్చాయని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News