Sunday, December 22, 2024

నాంపల్లిలో కాల్పుల కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలో గురువారం అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో పోలీసులు నిర్వహించిన డెకాయి ఆపరేషన్ లో ఈ కాల్పులు జరిగాయి. నాంపల్లి పోలీసులు, యాంటీ డెకయిట్ టీమ్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ సిపి ఆదేశాల మేరకు నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయంలో ప్రయాణికులు పడుకున్నప్పుడు వారిపై దాడి చేసి డబ్బులు, సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నట్లు సమాచారంతో నిన్న అర్ధరాత్రి సమయంలో తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. మాంగర్ బస్తికి చెందిన వారిద్దరూ పోలీసులపై గొడ్డలితో దాడికి యత్నించారు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం పోలీసులు జరిపిన కాల్పులలో రాజు అనే వ్యక్తికి తొడలో బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే అతడిని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. మరో వ్యక్తి అయ్యాన్ ను నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News