Saturday, November 9, 2024

హైదరాబాద్‌కు కొత్త కలెక్టర్..

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః హైదరాబాద్ జిల్లాకు యువ ఐఎఎస్ అధికారి కొత్త కలెక్టర్‌గా వచ్చారు. దీంతోచాలా కాలంగా జిల్లాలో కొనసాగతున్న ఇంఛార్జీ కలెక్టర్ పాలనకు తెరపడింది. 2018 ఐఎఎస్ బ్యాచ్ అధికారి అనుదీప్ దురిశెట్టిని జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాది కొత్త గూడెం జిల్లా అదనపు కలెక్టర్‌గా బాధ్యతలను నిర్వహించిన అనుదీప్ దురిశెట్టిని ప్రభుత్వం హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. దీంతో ఇప్పటీవరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ హైదరాబాద్ జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలను నిర్వహిస్తుండగా ఆయనను ఈ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది.

జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ ప్రియాంక అలా బదిలీ ః
జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ 2016 ఐఎఎస్ బ్యాచ్ అధికారి ప్రియాంక అలాను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను భద్రాది కొత్తగూడెం కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం అదేశాలను జారీ చేసింది. ప్రియాంక అలా గత ఏడాదిన్నర కాలంగా జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ హోదాలో రెవెన్యూ విభాగం బాద్యతలను నిర్వర్తించారు. అదేవిధంగా ఇటీవల జరిగిన హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా ఈ నియోజకవర్గం రిట్నరింగ్ అధికారిగా విజయవంతంగా బాధ్యతలను నిర్వర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News