Friday, November 15, 2024

ఇమ్రోజ్ తొలి సంపాదకుడెవరు?

- Advertisement -
- Advertisement -

యథాతథ ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌లో భారత ప్రభుత్వం ఏజెంట్‌గా నియమించబడిన వ్యక్తి కె.ఎం మున్షీ.
ఇతనికి బ్రిటీష్ ప్రతినిదితో సమాన హోదా ఉంటుంది.
కె.ఎం మున్షీ అధికార నివాసం గతంలో బ్రిటీష్ ప్రతినిధి నివాసం ఉన్న బొల్లారంలోని నివాసగృహం.
దీని పేరు దక్కన్ సదన్ కాని దానిలో ఏజెంట్ జనరల్ మున్షి నివాసం ఉండటానికి వీలు లేదని నిజాం ఆదేశించాడు.
1948 జనవరి 3న మున్షి హైదరాబాద్ చేరుకొని దక్కన్ హౌజ్‌ను తన నివాస గృహంగా చేసుకున్నాడు.
ఇలాంటి పరిస్థితులలో కూడా నిజాం రజాకార్ల ఆయుధ సేకరణకై 5 కోట్లు మంజూరు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
1948 మార్చి 31న ఎంఐఎం కేంద్ర కార్యాలయంలో రజ్వీ ఉపన్యసిస్తూ హైదరాబాద్ రాజ్యాన్ని ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించాడు.
రిటైర్డ్ సైనికులతో రజాకార్లకు శిక్షణ ఇప్పించేవాడు.
ఇలాంటి వ్యవహారాలను గమినించిన భారత ప్రభుత్వం సంస్థానాల వ్యవహారపు కార్యదర్శి వి.పి మీనన్ హైదరాబాద్ సంఘటనలను కేంద్రానికి తెలిజయేయగా ఈ ప్రభుత్వాల మధ్య సంతృప్తికరమైన సమాధానాలను సాధించుటకై మౌంట్‌బాటన్ మధ్యవర్తిత్వం జరిపాడు.
కె.ఎం మున్షి రచించిన గ్రంథం ది ఎండ్ ఆఫ్ ఎరా
లార్డ్ మౌంట్ బాటన్ మధ్యవర్తిత్వం
1948 మే 25న లార్డ్ మౌంట్‌బాటన్ (గవర్నర్ జనరల్) హైదరాబాద్ ప్రధాని మీర్ లాయక్ అలీతో సుమారు 5 గంటల పాటు సమావేశమై కొద్ది రోజుల్లో ఇండియా వదిలి పోనున్నానని, తానుండగానే భారత యూనియన్‌తో హైదరాబాద్ విలీనపు సెటిల్‌మెంట్ చేసుకుంటే మంచిదని..లేదంటే భారత సైన్యం దాడి చేస్తే హైదరాబాద్ సైన్యం తట్టుకోలేదని హెచ్చరించారు.
తన పత్రికా వ్యవహారాల కార్యదర్శి అలెన్ క్యాంప్‌బెల్‌ను మద్య వర్తిత్వం జరపడానికి హైదరాబాద్ పంపాడు.
వి.పి మీనన్, మీర్ లాయక్ అలీ కలిపి సంయుక్తంగా తయారు చేసిన సెటిల్ మెంట్‌పేరు. హెడ్స్ ఆఫ్ అగ్రిమెంట్.
ఈ చర్చల్లో హైదరాబాద్ ప్రతినిధులు లాయఖ్ అలి, సర్ వాల్టన్, పి. వెంకట్రామిరెడ్డి, అబ్ధుల్ రవూస్ జహీద్ అహ్మద్ పాల్గొన్నారు.
ఇరువైపు నేతలతో చర్చించిన తర్వాత ఫైనల్ సెటిల్‌మెంట్‌ను రూపొందించారు.
1948 జూన్ 15న ఫైనల్ సెటిల్‌మెంట్‌ను నిజాంకు అందజేయగా దీనిపై సంతకం చేయడానికి నిరాకరించాడు.
భారత ప్రభుత్వంపై విశ్వాసం ఉంచవలసిందిగా లార్డ్ మౌంట్‌బాటన్ సుదీర్ఘమైన లేఖ నిజాంకు రాయగా ఫలితం లేకుండా పోయింది.
1948 జూన్ 21న పదవీ విరమణ చేసి లార్డ్ మౌంట్‌బాటన్ స్వదేశానికి వెల్లాడు.
ఇందులోని ప్రతిపాదనలు
నిజాం చట్ట వ్యతిరేక సాయుధ దళాలను రద్దు చేయాలి.
ఆర్థిక, వ్యాపార సంబంధాల కొరకు తమ ప్రతినిధులను ఇతర దేశాలకు పంపవచ్చు.
నిజాం ప్రభుత్వానికి ఇతర దేశాలతో రాజకీయ సంబంధాలు ఉండకూడదు.
1949 జనవరి 1 లోపు రాజ్యాంగ పరిషత్తును సమావేశపరచాలి.
నిజాం మంత్రి వర్గంలో ముస్లిమేతరులు, ముస్లింలకు 60: 40 నిష్పత్తి కల్పించాలి.
తిరుమలగిరి, బొల్లారం, సికింద్రాబాద్‌లలో భారత సేనలను విరమించుకోవాలని నిజాం కోరగా భారత ప్రభుత్వం విరమించుకుంది.
షోయబుల్లాఖాన్ హత్య
జమ్రూద్‌హల్ సభలో కాశీం రజ్వీ విద్వేషాల్ని రెచ్చగొట్టే విధంగా ఉపన్యసించాడు.
భారత జాతీయ నాయకులపై తీవ్ర విమర్శలు చేశాడు.
రజాకార్ల చర్యల్ని మిమర్శిస్తూ కథనాలు రాసిన పత్రిక ఇమ్రోజ్ పత్రిక.
ఇమ్రోజ్ పత్రికా సంపాదకుడు షోయబుల్లాఖాన్.
1947 నవంబర్ 1న ఇమ్రోజ్ పత్రిక ప్రథమ సంచిక వెలువడింది. దీనిలో సంపాద కీయం భారత్‌లో విలీనం కావాలి.
1948 జనవరి 29 సంచికలో సంపాదకీయం పగటి ప్రభుత్వం.. రాత్రి ప్రభుత్వం
నిజాంకు హైదరాబాద్‌ను భారత్‌లో విలీనం చేయాలని 7గురు ముంస్లిం ప్రముఖులు ఇచ్చిన విజ్ఞప్తిని షోయబుల్లాఖాన్ సంపాదకీయంగా ప్రచురించాడు.
ప్రముఖులు
నవాబ్ ముజూర్‌జంగ్ (సుబేదార్‌గా పనిచేసి నిజాంకు సన్ని హితంగా ఉండేవాడు)
మహ్మద్ హుస్సేన్ జాఫర్ (నిజాం ప్రభుత్వంలో విద్యాశాఖ డైరెక్టర్)
మీర్జా (తహసిల్ధార్ ఉద్యోగానికి రాజీనామ చేశాడు)
మీర్ బాకర్ అలీమీర్జా
ముల్లా అబ్ధుల్ బాసిత్
అహ్మద్ మీర్జ
హుస్సేన్ అబ్ధుల్ మునీర్
1948 ఆగస్టు 22న రజాకార్ల ముఠా లింగంపల్లి సమీపంలో షోయబుల్లాఖాన్‌ను చేతులు నరికి అతికిరాతకంగా చంపేశారు.
కాసీం రజ్వీ ఆదేశాల మేరకు ఈ దారుణ హత్య చేసింది అబ్ధుల్ మునీంఖాన్.
ఖాసీం రజ్వీ వ్యాఖ్యలు
ఢిల్లీ ఎర్రకోటపై ఆసఫ్‌జాహి జెండా ఎగురవేస్తాం
బంగళా ఖాతంలోని నీరు నిజాంపాదాలను కడుగుతోంది.
హైదరాబాద్ సంస్కృతిని గంగా, యమునా తెహజీబ్ అని కీర్తించాడు.
యుఎన్‌ఒకు హైదరాబాద్ ప్రభుత్వం ఫిర్యాదు
ఆగస్టు 21, 1948న కేబుల్‌గ్రాం ద్వారా ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షునికి నిజాంరాజు భారతయూనియన్‌పై ఫిర్యాదు చేశాడు.
యునైటెడ్ నేషన్స్ చార్టర్ లోని ఆర్టికల్ 35(2) కింద ఫిర్యాదు చేశారు.
ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షుడి పేరు సర్ అలెగ్జాండర్ (యుకె)
ఐక్యరాజ్య సమితి కార్యదర్శి పేరు ట్రిగ్విలి
1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్‌పై దాడి ప్రారంభమైందని సెక్రటరీ జనరల్‌కు కేబుల్ గ్రాం ద్వారా హైదరాబాద్ ప్రభుత్వం తలిపింది.
1948, సెప్టెంబర్ 15న నిజాం ప్రభుత్వం ఐరాస సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదును సమర్పించారు.
సెప్టెంబర్ 16, 1948 గురువారం రోజు సెక్యూరిటీ కౌన్సిల్ పారిస్‌లో జరిగిన 357వ సమావేశంలో హైదరాబాద్ ప్రభుత్వ ఫిర్యాదుపై చర్చించింది.
సెక్యూరిటీ కౌన్సిల్‌లో తమ వాదనలు వినిపించినవారు.
భారత ప్రభుత్వం తరఫున సర్ రామస్వామి మొదలియార్
హైదరాబాద్ ప్రభుత్వం తరఫున నవాబ్ మోయిన్ నవాజ్ జంగ్.
నవాజ్‌జంగ్ వాదన
ప్రతిక్షణం విలువైనది, సెక్యూరిటీ కౌన్సిల్ వెంటనే చర్యతీసుకొని హైదరాబాద్‌పై దాడిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రామస్వామి మొదలియార్ వాదన
ఆరోపణలో నిజానిజాల గురించి తాను చర్చించబోవడం లేదని సెక్యూరిటీ కౌన్సిల్ ముందు హాజరుకావడానికి హైదరాబాద్‌కు హక్కు లేదని అభ్యంతరం వ్యక్తం చేశాడు.
నవంబర్ 2-0, 1948 సోమవారం వరకు గడువు కోరారు.

న్యాయవాదుల కార్యకలాపాలు
హైదరాబాద్‌లోని లాయర్లు, నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు.
1948 ఫిబ్రవరి 25న తమ న్యాయవాద వృత్తికి సమ్మెచేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తికి లేఖ ఇచ్చారు.
1948 ఏప్రిల్‌లో లాయర్ల నిరసన సమితి ఏర్పడగా దానికి అధ్యక్షుడుగా ఎన్నికైనది వినాయకరావు విద్యాలంకార్
తర్వాత కాలంలో గణపతి లాల్ న్యా యవాది అధ్యక్షతన న్యాయవాదుల ప్రతిఘటన సమితి ఏర్పాటైంది.
1948 ఏప్రిల్ 6న ఈ సమితి కోర్ట్‌లను భహిష్కరిస్తూ నిజాంకు లేఖ రాసింది.
అనంతరం 1948 సెప్టెంబర్ 17 వరకు కోర్టులు పనిచేయలేదు.

రవాణాశాఖలో 113 ఏఎంవిఐ

పోస్టులకు నోటిఫికేషన్
వివరాలు : 113 ఎఎంవిఐ పోస్టులు
అర్హతలు : అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదా మూడేళ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ పూర్తిచేసినా అర్హులే. అలాగే దరఖాస్తుదారులు హెవీ మోటర్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ (ట్రాన్స్‌పోర్ట్) కలిగి ఉండాలి.
ఇతర అర్హతలు : పురుషులు కనీస ఎత్తు 165 సెంటీమీటర్లు, ఛాతీ 86.3 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఛాతీ 5 సెంటీమీటర్లు విస్తరించాలి. ఎస్‌సి, ఎస్‌టిలకు ఎత్తు 160 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండకూడదు. ఛాతీ 83.80 సెంమీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు విస్తరించాలి. అలాగే మహిళలు ఎత్తు 157.5 సెంటీమీటర్లు, ఛాతీ 82.30 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఛాతి 5 సెంటీమీటర్లు విస్తరించాలి. ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులు ఎత్తు 152.5 సెంటీ మీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. ఛాతీ 79.80 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు విస్తరించాలి.
వయస్సు : 2022 జులై 1 నాటికి 21 నుంచి -39 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సి, ఎస్‌టి, బిసి,ఇడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎన్‌సీసీ, మాజీ సైనికులకు మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెగ్యులర్ సర్వీసు పొందిన నాటి నుంచి ఐదేళ్ల పాటు వయో పరిమితి సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం : అబ్జెక్టివ్ టైప్ పరీక్ష(పేపర్ 1, పేపర్ 2). నిర్ధేశించిన శరీరదారుఢ్యం కలిగి ఉండాలి.
దరఖాస్తుదారులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.200, ఎగ్జామ్ ఫీజుగా రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులకు ఎగ్జామ్ ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు, పరీక్ష ఫీజు : రూ.200
పరీక్ష ఫీజు : 120
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 05/08/2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 05/09/2022
వెబ్‌సైట్ : www.tspsc.gov.in

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News