Monday, December 23, 2024

దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తీసుకొస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు ఉంటుందని వివరించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు సర్వేకు కేంద్రం నిధులు మంజూరు చేసిందన్నారు. ఒఆర్‌ఆర్‌పి వివరాలు తెలంగాణ ప్రభుత్వానికి అందించామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆర్‌ఆర్‌ఆర్, ఒఆర్‌ఆర్‌పితో హైదరాబాద్‌కు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రస్తుతం రీజినల్ రింగ్‌రోడ్ రూట్ అంశం కొలిక్కి వచ్చిందన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్ష మార్పు అంశం అధిష్టానం దృష్టిలో లేదని, బిజెపి రాష్ట్ర అధ్యక్ష మార్పుపై పార్టీలో చర్చలేదని, వదంతులు ఎందుకు సృష్టిన్నారో తెలియడం లేదని మండిపడ్డారు. ఒకరిద్దరు పార్టీలో చేరనంత మాత్రాన నష్టం లేదన్నారు.

Also Read: ఎంఎల్‌ఎ భార్య ఫోన్‌ కొట్టేశాడు… దొరికిపోయాడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News