- Advertisement -
హైదరాబాద్: హిందూ దేవుళ్ళను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న పాస్టర్ హనీ జాన్సన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం విశాఖపట్నంలో హనీ జాన్సన్ ను అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ కు తరలించారు. వైజాగ్ కు చెందిన పాస్టర్ హనీ జాన్సన్ ఒక చర్చిని నడపడంతో పాటు యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడి ప్రసంగాలు చేస్తారు. ఈ క్రమంలో మహిళలపై, హిందూ దేవుళ్ళపై కించపరిచే వ్యాఖ్యలు చేశారని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. దీంతో హనీ జాన్సన్ అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపర్చారు. హనీ జాన్సన్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Hyderabad police arrest to Honey Johnson in Vizag
- Advertisement -