Tuesday, December 3, 2024

చోరీలు చేస్తున్న దొంగ అరెస్ట్.. పరారీలో మరొకరు

- Advertisement -
- Advertisement -

Hyderabad Police arrested burglar

హైదరాబాద్: ఇళ్లల్లో చోరీలు చేస్తున్న ఓ దొంగను నగర పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి 200 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆటో, నగదు రూ.3,000 స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని కిషన్‌బాగ్‌కు చెందిన హబీబ్ అజ్‌మత్, చాదర్‌ఘాట్‌కు చెందిన షేక్ షారూక్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిందితులపై సంతోష్ నగర్, ఫలక్‌నుమాలో కేసులు ఉన్నాయి. అజ్‌మత్‌ను పోలీసులు అరెస్టు చేయగా, షేక్ ఫారూక్ పరారీలో ఉన్నాడు, ఫారూక్‌పై 30కేసులు ఉన్నాయి.ఇద్దరు చేస్తున్న పనివల్ల వస్తున్నడబ్బులు వారి జల్సాలకు సరిపోవడంలేదు. ఇద్దరు కలిసి మూడు చోరీలు చేశారు.

ఇద్దరు కలిసి హబీబ్, షేక్ ఫారూక్ కలిసి తెల్లవారుజామున లేస్తారు, అందరూ నమాజ్ చేసేందుకు వెళ్లడానికి మేయిన్ డోర్ తీసి వెళ్తున్నారు. ఇదే సమయంలో నిందితులు వారి ఇళ్లల్లో చేరుకుని ఇంట్లోని బంగారు, వెండి వస్తువులు, నగదు, మొబైల్ ఫోన్లు తదితరాలను దొంగతనం చేసేవారు. చోరీ చేసిన సొత్తును ఇద్దరు సమానంగా పంచుకుంటారు. నిందితుడిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం సంతోష్‌నగర్ పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ ఎడిసిపి చక్రవర్తి గుమ్మి పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సై శ్రీశైలం, తకియుద్దిన్, నరేందర్, చంద్రమోహన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News