Saturday, December 21, 2024

యువతులను వేధించిన ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యువతులను వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు యువకులను హైదరాబాద్ షీటీమ్స్ సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన బి.ప్రదీప్ రెడ్డికి బాధిత యువతి ఓ జాబ్ ఇంటర్వూలో పరిచయమైంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఓ రోజు ప్రదీస్ బాధిత యువతిని పార్టీ కోసం పిలిచాడు. నిందితుడిని నమ్మిన యువతి అతడి ఇంటికి వెళ్లింది. అక్కడ నిందితుడు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిసి ఇవ్వడంతో తాగింది. తర్వాత స్పృహ కోల్పోవడంతో ఆమె ఒంటిపై ఉన్న దుస్తులు తొలగించి ఫొటోలు, వీడియోలు తీశాడు. అప్పటి నుంచి యువతిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు.

బాధితురాలు షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, నర్సుగా పనిచేస్తున్న యువతితో ప్రేమ పేరు చెప్పి శారీరకంగా వాడుకుని వివాహం చేసుకునేందుకు నిరాకరించిన యువకుడిని హైదరాబాద్ షీటీమ్స్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మణికొండకు చెందిన పి. గౌతం వినయ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గౌతం యువతి పనిచేస్తున్న ప్రాంతానికి తరచూ వచ్చే వాడు, అప్పుడే ప్రేమిస్తున్నానని చెప్పాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే బాధితురాలు గర్భం దాల్చడంతో పిల్స్ ఇచ్చి అబార్షన్ అయ్యేలా చేశాడు. తర్వాత యువతిని వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో బాధితురాలు షీటీమ్స్‌ను ఆశ్రయించడంతో నిందితుడిని అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు….
మహిళలు, యువతులను అసభ్యంగా తాకుతున్న ముగ్గురు పోకిరీలను షీటీమ్స్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జీడిమెట్లకు చెందిన సంతోష్, ఎండి మహ్మద్,ఎం. సత్యన్ చారీ యువతులను అసభ్యంగా తాకుతుండడంతో స్పై కెమెరాల్లో చూసిన పోలీసులు పట్టుకున్నారు.. నిందితులను కోర్టులో హాజరుపర్చగా వారికి జైలు శిక్ష విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News