Saturday, December 21, 2024

దట్టి సమర్పించిన నగర సిపి

- Advertisement -
- Advertisement -

Hyderabad Police Commissioner CV Anand visited Bibika Alava

మనతెలంగాణ, సిటిబ్యూరోః మొహర్రం కోసం పది రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. బిబికా అలావాను సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సందర్శించి దట్టిని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులకు పోలీసులు అన్ని విధాలుగా సహకరిస్తారని తెలిపారు. ఈ నెల 10వ తేదీన మొహర్రం ర్యాలీలు నిర్వహిస్తారని తెలిపారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు ట్రాఫిక్ డిసిపితో మానిటరింగ్ చేశామని తెలిపారు. ఇప్పటి కే అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. భద్రతా ఏర్పాట్లు చేశామని, పోలీసులు ఆయా ప్రాంతాల్లో మోహరించామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News