Tuesday, September 17, 2024

బిఆర్‌ఎస్ పార్టీకి హైదరాబాద్ పోలీస్ కౌంటర్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టీ వేసిన ట్వీట్‌పై ఆదివారం హైదరాబాద్ సిటీ పోలీస్ స్పందించింది. ‘నిజాలు తెలుసుకొని మీరు ఇక్కడ పోస్ట్ పెట్టి ఉంటే బాగుండేది. మీరు పెట్టిన పోస్ట్ ప్రజలని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. మీరు వీడియోలో చూపించిన అమ్మాయితో పాటు మరికొందరు ధర్నా చేస్తుండగా వారు షాప్స్‌లోకి వెళ్లి బిక్షాటన చేస్తున్నారు అని షాప్స్ వారు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్‌లు అక్కడకి చేరుకొని ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగకుండా అక్కడ ఉన్న వారిని పంపి వేసే క్రమంలో అట్టి అమ్మాయి వారి నుంచి తప్పించుకొని పక్కన ఉన్న ఒక అకాడమీ లోకి వెళ్లింది. తాను ఇక్కడ పని చేసే అమ్మాయిగా చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది.

పోలీస్ వారు మీరు చెప్పినట్టు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయలేదు’ అని హైదరాబాద్ సిటీ పోలీస్ సమాధానం ఇచ్చింది. అంతకు ముందు తెలంగాణ నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయనున్నట్లు యువకులు ప్రకటించారు. ఈ క్రమంలోనే పలువురు నిరుద్యోగులు శనివారం హైదరాబాద్ అశోక్‌నగర్, చిక్కడపల్లి, ఆర్‌టిసి క్రాస్‌రోడ్స్‌లో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీ సులు వారిని అడ్డుకున్నారు. దీనిపై బిఆర్‌ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ‘మరీ ఇంత దుర్మార్గమా! నిరుద్యోగులు భిక్షాటన చేయగా వారికి డబ్బులు ఇచ్చిందని ఒక మహిళను బలవంతంగా అరెస్ట్ చేస్తున్న పోలీసులు’ అని ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌కు పై విధంగా హైదరాబాద్ పోలీసు కౌంటర్ ట్వీట్ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News