- Advertisement -
హైదరాబాద్: అవయవదానానికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి నగర పోలీసులు మరోసారి తమ దాదృత్వం చాటుకున్నారు. మలక్‌పేటలోని యశోద ఆస్పత్రి నుంచి లంగ్స్‌ను తీసుకుని అంబులెన్స్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి చేరింది. ఈ రూట్‌లో నగర ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేవారు. మలక్‌పేట నుంచి కిమ్స్ ఆస్పత్రి మధ్య ఉన్న 11 కిలోమీటర్ల దూరాన్ని అంబులెన్స్ కేవలం 13 నిమిషాల్లో చేరుకుంది. లంగ్స్‌ను తీసుకుని అంబులెన్స్‌లో ఉదయం 10.55 గంటలకు బయలు దేరి సికింద్రాబాద్‌లోని కిమ్స్‌కు 11.08 నిమిషాలకు చేరుకుంది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన పోలీసులకు ఆయా ఆస్పత్రుల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -