Monday, December 23, 2024

నడ్డాకు నై

- Advertisement -
- Advertisement -

ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు

సికింద్రాబాద్‌లో గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు
కొవిడ్ నిబంధనల మేరకు నడుచుకున్న పోలీసులు
మనతెలంగాణ/హైదరాబాద్:బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా పోలీసుల ఆంక్షల నడుమే శంషాబాద్ నుంచి సికింద్రాబాద్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు రోడ్డు మార్గంలో మంగళవారం రాత్రి చేరుకున్నారు. నడ్డా వెంట కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తరుణ్ చుగ్ వున్నారు. ఈ సందర్భంగా నడ్డాతో సహా బిజెపి నేతలు నల్ల కండువాలు, మాస్క్‌లు ధరించారు. నడ్డా రాక విషయం తెలుసుకున్న బిజెపి శ్రేణులు భారీగా సికింద్రాబాద్‌కు తరలివచ్చారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు సైతం భారీగా మోహరించారు. అయితే మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న జెపి నడ్డా నివాళులు అర్పించి బిజెపి నిరసన కార్యక్రమాన్ని ముగించారు. అయితే మంగళవారం ఉదయం నుంచి బిజెపి ర్యాలీ యధావిధిగా జరుగుతుందని బిజెపి శ్రేణులు ఉద్ఘాటించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి ర్యాలీ నిర్వహించకుండానే నడ్డా ఈ విధంగా బిజెపి నిరసన కార్యక్రమం ముగించేశారు. అంతకు ముందు శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడతూ.. తాము ర్యాలీ సందర్భంగా కరోనా నిబంధనలు పాటిస్తామన్నారు. తన ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కరోనా నిబంధనలతోనే గాంధీ విగ్రహం వద్దకు వెళ్తామని నడ్డా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగానే గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తాని జెపి నడ్డా అన్నారు. తనను జాయింట్ సిపి కార్తికేయ కలిశారని.. రాష్ట్రంలో కరోనా నిబంధనలు అమల్లో వున్నాయని చెప్పారని ఆయన వెల్లడించారు. అనంతరం జెపి నడ్డాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు ప్రజల ఆరోగ్యం, ఒమిక్రాన్ కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు జెపి నడ్డా ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు నగర పోలీసులు ఓ ప్రకటనలో వివరాలు తెలియజేశారు. ఇటీవల బండి సంజయ్ అరెస్ట్‌తో రాష్ట్రంలో ఉద్రిక్తతల నేపథ్యంలో జెపి నడ్డా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు ప్రాముఖ్యత చోటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బిజెపి పార్టీ నిరసనలు తలపెడుతూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది. ఈ ర్యాలీకి బిజెపి రాష్ట్ర నాయకులు పోలీసులను అనుమతి కోరగా హైదరాబాద్ పోలీసులు నిరాకరించారు. ఈ విషయమై నార్త్ జోన్ డిసిపి చందనాదీప్తి.. జెపి నడ్డా ర్యాలీ అనుమతి నిరాకరించిన విషయం మీడియాకు తెలియజేశారు.
ఎయిర్‌పోర్టులోనే బిజెపి నేతలతో సమావేశమైన నడ్డా
ఎయిర్‌పోర్టులోనే తెలంగాణ బిజెపి నేతలతో నడ్డా సమావేశమయ్యారు. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌చుగ్, డాక్టర్ కె లక్ష్మణ్, డికె అరుణ, జితేందర్‌రెడ్డి, విజయశాంతి, రామచంద్రరావు, కానం వెంకటేశ్వర్లు తదితరులతో ఆయన భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై వారితో చర్చించారు.
మేం అనుమతి ఇవ్వలేదు.. అవన్నీ అవాస్తవం ః సిపి సివి ఆనంద్
బిజెపి ర్యాలీకి అనుమతి లేదని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు. బిజెపి తలపెట్టిన ర్యాలీకి తాము అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. ర్యాలీకి అనుమతించారన్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేశారు. కోవిడ్ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోనను పకడ్బందీగా అమలు చేయాలని పోలీసులకు ఆయన సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.

Hyderabad Police denied JP Nadda Rally

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News