Wednesday, January 22, 2025

మీడియా సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన హైదరాబాద్ పోలీస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ‘ఎక్స్’ లో కంటెంట్ పెట్టినందుకు ‘తెలుగు స్క్రయిబ్ ’ పైన ఆర్. నితీశ్ కుమార్ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దాంతో సైబర్ పోలీసులు ‘తెలుగు స్ర్కయిబ్’పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదుదారు మత సామరస్యాన్ని దెబ్బతీసేలా క్లిప్స్ పెట్టాడని కూడా పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జైనూర్ లో మత ఘర్షణలు చెలరేగడాన్ని ఫిర్యాదు దారుడు ఉదాహరించాడు. కాగా ఆ వీడియోలను ‘తెలుగు స్క్రయిబ్’ తొలగించడం జరిగింది.

పోలీసులు సెక్షన్ 66సి(దొంగతనం), ఐటి చట్టం తాలూకు 66డి(కంప్యూటర్ వనరులను ఉపయోగించి మోసగించడం), భారతీయ న్యాయ సంహిత కు చెందిన సెక్షన్ 196(రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం) కింద కేసు రిజిష్టర్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News