Saturday, April 19, 2025

ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. వారిపై పోలీసుల ఫోకస్!

- Advertisement -
- Advertisement -

అన్ని జట్ల మధ్య హోరా హోరీ పోరుతో జోరుగా కొనసాగుతున్న ఐపీఎల్‌ 2025లో సీజన్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఐపీఎల్‌లో 5 హాట్ ఫేవరేట్ జట్ల ఫ్రాంచైజీలను హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కాంటాక్ట్ చేసినట్లు ఆధారాలు సేకరించిన బీసీసీఐ.. మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడే అవకాశం ఉందని ఇప్పటికే అన్ని జట్లను హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు.. ఆ వ్యాపారవేత్త ఎవరనేదానిపై ఆరా తీస్తున్నారు. ఆధారాలు ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. ఐసీసీ, బీసీసీఐ, స్థానిక క్రికెట్ క్లబ్‌తో కాంటాక్ట్ ఉన్న వ్యక్తులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News