Friday, December 27, 2024

ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బెదిరించిన వ్యక్తి గుర్తింపు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బెదిరించిన కేసులో పోలీసులు నిందితుడిని గుర్తించారు. కొంత కాలం నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు విదేశాల నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. దీంతో రాజాసింగ్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని గుర్తించారు. చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ ఖాసిం 14 ఏళ్ల క్రితం దుబాయ్‌కు వెళ్లాడు అక్కడి నుంచి కువైట్‌కు వెళ్లి అక్కడే ఉంటున్నాడు.

అక్కడి నుంచి ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ ద్వారా నిందితుడు రాజాసింగ్‌కు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. నిందితుడిని గుర్తించిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఎల్‌ఓసి జారీ చేశారు. నిందితుడు నగరంలో శోభాయాత్ర నిర్వహించవద్దని నిర్వహిస్తే తీవ్ర పరిణామా లు ఎదుర్కోవలసి ఉంటుందని బెదిరించారు. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ అప్పటి డిజిపి అంజనీకుమార్, హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News