Friday, December 20, 2024

న్యూ ఇయర్ వేడుకలకు పోలీసు మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డిసెంబర్ 31/జనవరి1,2023 అర్ధరాత్రి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదివారం త్రీ స్టార్, అంతకు మించిన స్టార్స్ ఉన్న హోటల్స్, క్లబ్స్, పబ్స్ యాజమాన్యాలకు మార్గదర్శకాలను జారీ చేశారు. అర్ధరాత్రి 1:00 గంట వరకు ఈవెంట్స్/ప్రోగ్రామ్స్ నిర్వహించే త్రీస్టార్స్, ఆపైన స్టార్స్ ఉన్న హోటల్స్, క్లబ్స్, పబ్స్ మేనేజ్‌మెంట్ అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకోవాలి, అది కూడా అడ్వాన్స్‌గా అంటే కనీసం 10 రోజుల ముందే.
మార్గదర్శకాలలో ముఖ్యమైనవి:

* ఏపి పబ్లిక్ సేఫ్టీ(మెజర్స్) ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్ట్ 2013 ప్రకారం ఆర్గనైజర్లు సిసిటివి కెమెరాలను రికార్డింగ్ సదుపాయంతో ఏర్పాటు చేయాలి. వాటిని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో ఏర్పాటు చేయాలి. పార్కింగ్ ప్రదేశాలలో కూడా సిసిటివిలను ఏర్పాటు చేయాలి.
* తమ సంస్థ రక్షణ కోసం, ట్రాఫిక్ నిర్వహణ కోసం ఆర్గనైజర్లు, మేనేజ్‌మెంట్ తగిన ఏర్పాట్లు చేయాలి.
* దుస్తులు, డ్యాన్స్‌లు, ఉపయోగించే పదాలు డీసెంట్‌గా, మర్యాదపూర్వకంగా ఉండేలా నిర్వాహకులు చూడాలి. కార్యక్రమాలలో ఎలాంటి అశ్లీత, దిగంబరత్వానికి తావివ్వకూడదు. ధ్వని స్థాయి(సౌండ్ లెవల్స్) 45 డెసిబెల్స్ లేక అంతకన్నా తక్కువ ఉండేలా చూడాలని పోలీసుల ప్రెస్‌నోట్ పేర్కొంది.
* ఈవెంట్లు జరిగే ప్రదేశాల్లో పటాసులు అనుమతించరాదని ఆర్గనైజర్లను హెచ్చరించడమైనది.
* కెపాసిటీకి మించి పాసులు/టిక్కెట్లు/కూపన్లు నిర్వాహకులు ఇవ్వరాదు. కెపాసిటీకి మించి ఇస్తే అది శాంతి, భద్రతల సమస్యగా మారే అవకాశం ఉంటుంది.
*ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లను ఆర్గనైజర్లు ఏర్పాటు చేయవలసి ఉంటుంది, తద్వార ట్రాఫిక్ ఫ్లోకు అంతరాయం ఏర్పడకుండా చూడాలి.
* పబ్స్, బార్స్‌లో జంటలకు ఏర్పాటుచేసిన ప్రోగ్రామ్‌లలో మైనర్లను అనుమతించకూడదు.
* ప్రోగ్రామ్స్ ఆర్గనైజర్లు ఎవరినీ డ్రగ్స్, నార్కొటిక్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ వంటివి తీసుకోడానికి అనుమతించరాదు. ఒకవేళ పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి.
* ప్రాంగణంలో పార్కింగ్ పద్ధతి ప్రకారం జరిగేలా చూడాలి.
* ఎక్సైజ్ శాఖ అనుమతించిన సమయం తర్వాత ఎవరికీ మద్యపానీయాలు ఇవ్వకూడదు.
* బాగా తాగి మత్తులో ఉండే వ్యక్తులు సురక్షితంగా వారి గమ్యస్థానానికి వెళ్లేందుకు డ్రైవర్లు/క్యాబ్స్ ఏర్పాటు చేయాలి.
* టాపాసులు కాల్చేలా, ప్రదర్శించేలా ఎవరినీ అనుమతించరాదు.
* జిల్లా ఫైర్ ఆఫీసర్/రీజియల్ ఫైర్ ఆఫీసర్ సూచనలను పాటించాలి.
* ఏదైనా నష్టం, న్యూసెన్స్ వంటివి జరిగి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగితే దరఖాస్తు చేసుకున్న సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
* మోటారు వాహనాల చట్టం 185వ సెక్షన్ ప్రకారం మద్యం తాగి వాహనాలు నడిపించడం నేరం.
* అనుమతించిన ఆల్కాహాల్ పరిమితి 30 మిగ్రా. /100 మిగ్రా. అనగా 30 మైక్రోగ్రాములు/100మిలీ రక్తం మేరకే అనుమతి ఉంది. బ్రీత్ అనలైజర్స్‌లో ఆ పరిమితికి మించి రికార్డయితే అది చట్ట ఉల్లంఘన కిందే లెక్క.
* ఎవరైనా తాగిన మత్తులో వాహనం నడుపుతూ దొరికితే వారి వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరుగుతుంది, అది కూడా తాత్కాలిక కస్టడీలోకి.
* డ్రంక్ అండ్ డ్రైవింగ్‌కు రూ. 10000 మరియు/లేక 6 నెలల జైలు శిక్ష.
* నియమాలు ఉల్లంఘించిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను 3 నెలలు, అంతకు మించి లేక శాశ్వతంగా సస్పెండ్ చేయొచ్చు.
* ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను తొలగించరాదు. శబ్దకాలుష్యం లేకుండా చూడాలి.
* ఓవర్‌స్పీడ్ డ్రైవింగ్ చేసేవారిని మోటారు వాహన చట్టం 183,184 సెక్షన్ల క్రింద శిక్షించడం జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News