పోలీసులు ఆస్పత్రికి తరలించారు. రేవతి మృతిచెందగా, శ్రీతేజ్ 13 రోజుల నుంచి కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు హీరో అల్లు అర్జున్, సంధ్యా థియేటర్ యాజమాని, ఇద్దరు మేనేజర్లను అరెస్టు చేశారు. కోర్టు వారికి బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్షంపై నోటీసులు జారీ చేశారు. నోటీసులకు పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
అల్లు అర్జున్ బెనిఫిట్ షోకు వస్తున్న విషయం చిక్కడపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో థియేటర్ ఇరువైపులా రెస్టారంట్లు ఉన్నాయని, నటులొస్తే భద్రత కల్పించలేమని చిక్కడపల్లి పోలీసులు ముందుగానే హెచ్చరించినట్టు ఓ రిపోర్టు సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే వైరల్ అయింది. సంధ్య 70ఎంఎం. 35ఎంఎం రెండు థియేటర్లు ఒకేచోట ఉండగా, వీటిలో దాదాపు 2,520 సీటింగ్ కెపాసిటీ ఉంది. మహిళలు థియేటర్లోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా ఎంట్రీ, డిస్ప్లే బోర్డులు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్లేందుకు ఒకటే మార్గం ఉంది. ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్ కు వచ్చే విధంగా ప్రోత్సహిస్తోన్న యాజమాన్యం. రద్దీని నియంత్రిచేందుకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులు దర్యాప్తులో తేలింది. అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం, బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. తాజాగా సంధ్య థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు ఇచ్చారు.