Thursday, December 26, 2024

స్పా,సెలూన్‌లపై పోలీసులు దాడులు..ఏడుగురు యువతులు అదుపులోకి

- Advertisement -
- Advertisement -

స్పా,సెలూన్‌ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పలు స్పాలు,సెలూన్‌లపై పోలీసులు దాడులు నిర్వహించారు. రెండింటిలో తనిఖీలు చేసిన పోలీసులు ఏడుగురు యువతులను, ఐదుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. చందానగర్‌లోని ఓ స్పాలో దాడులు నిర్వహించి వ్యభిచారం నిర్వహిస్తున్న నలుగురు యువతులను,ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు.

కెపిహెచ్‌బీ కాలనీలో ఓ సెలూన్‌లోనూ దాడులు నిర్వహించి ముగ్గురు యువతులను, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. స్పా,సెలూన్‌ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్నా సమాచారం మేరకు దాడులు నిర్వహించి, నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నగరవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నామని, వ్యభిచారం నిర్వహిస్తే బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News