Thursday, January 16, 2025

రెండు గంటల్లో రెండు కిడ్నాప్ కేసులు చేధించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః రెండు గంటల్లో ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసిన సంఘటన నగరంలోని నార్త్‌జోన్ డివిజన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….మహంకాళి, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇద్దరు పిల్లలను ఆదివారం తెల్లవారు జామున కిడ్నాప్ చేశారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

స్థానికంగా ఉన్న సిసిటివిల ఫుటేజ్‌ను పరిశీలించగా నిందితులను గుర్తించారు. ఆటోలో వచ్చి ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసినట్లు సిసిటివి ఫుటేజ్‌లో ఉండడంతో ఆటోడ్రైవర్ ఇమ్రాన్, ప్రవీణగా గుర్తించారు. వారిని ఇద్దరిని రెండు గంటల్లో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పిల్లలను రక్షించి తల్లిదడ్రులకు అప్పగించారు. నిందితులు పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. డిసిపి చందనాదీప్తి పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News