Sunday, December 22, 2024

200 కిలోల గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః డిసిఎంలో గంజాయి తరలిస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్ న్యూ), లంగర్‌హౌస్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 200 కిలోల గంజాయి, డిసిఎం, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.60లక్షలు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని ఈస్ట్‌గోదావరి జిల్లా, రాజమండ్రి, మోరంపూడికి చెందిన సి. శ్రీనివాసరావు, డ్రైవర్, సత్తిబాబు, రాజేంద్రనగర్‌కు చెందిన డ్రగ్స్ విక్రేత ఎండి హబీబ్‌ను అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన పర్వేజ్, జావీద్, మంగేష్, ఎపికి చెందిన నగేష్, పాండు పరారీలో ఉన్నారు.

శ్రీనివాస్ రావు, సత్తిబాబును సీలేరుకు చెందిన పాండు, నగేష్ కలిశారు. గంజాయి రవాణా చేస్తే డబ్బులు బాగా వస్తాయని చెప్పారు. ఒ ట్రిప్పుకు వారికి రూ.1,20,000 ఇచ్చాడు, ఎలా గంజాయిని రవాణా చేయాలో వారికి వివరించారు, దీంతో డిసిఎంలో వారు ప్రత్యేకంగా బాక్స్‌ను తయారు చేయించారు. దానిలో పెట్టుకుని గంజాయిని రవాణా చేస్తున్నారు. పాండు, నగేష్ కలిసి ఇద్దరికి రాజమండ్రి వద్ద 200 కిలోల గంజాయిని ఇచ్చారు. దానిని హైదరాబాద్‌లో గంజాయి విక్రేతలు ఎండి హబీబ్, పర్వేజ్‌కు అందించాలని చెప్పారు. గంజాయి తీసుకుని బయలుదేరిన విషయం హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సమాచారం అందింది.

లంగర్‌హౌస్ పోలీసుల సాయంతో గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నారు. ఇక్కడి నిందితులను గంజాయిని ఇచ్చిన తర్వాత దానిని మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు తరలించనున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తు కోసం లంగర్‌హౌస్ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ రాజేష్, ఎస్సై డానియల్ కుమార్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News