సిటిబ్యూరోః ఎన్నికల విధుల్లో భాగంగా ఎస్‌నగర్ పోలీసులు గురువారం చేపట్టిన తనిఖీల్లో భారీ ఎత్తున్న నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లో పోలీసులు 14,70,500 నగదు, బంగారు ఆభరణాలు, మద్యంను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….ఇన్స్‌స్పెక్టర్ పివి రామప్రసాదరావు, డిఐ రాఘు, ఎస్సై సూరజ్ తమ సిబ్బందితో కలిసి సత్యం థియేటర్ వద్ద ఉదయం 10.30 గంటలకు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే కారులో తనిఖీ చేయగా రూ.9,90,000 నగదు, బంగారు ఆభరణాలు, మద్యం పట్టుకున్నారు.
వాటికి ఆధారాలు చూపించాలని కోరగా తేజ్‌పాల్ సింగ్ జూవెలర్స్ షాపులో పనిచేస్తున్న వ్యక్తిని కోరగా చూపించలేకపోయాడు. కాగా సాయంత్రం 4 గంటలకు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు విజేత సూపర్‌మార్కెట్ వద్ద చేపట్టిన వాహనాల తనిఖీల్లో బైక్‌పై తరలిస్తున్న రూ.4,80,500 స్వాధీనం చేసుకున్నారు. ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్న ధన్‌రాజ్ బైక్‌పై నగదు తీసుకుని వెళ్తుండగా పట్టుకున్నారు. నగదుకు సంబంధించిన ఆధారాలు చూపించకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు.