- Advertisement -
మనతెలంగాణ, హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసులు శనివారం గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేసి మరోసారి అవయవదానానికి సహకరించారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి లంగ్స్(ఊపిరితిత్తులు) తీసుకుని బయలు దేరిన అంబులెన్స్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి చేరుకుంది. సైబరాబాద్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్ కోసం గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశారు. ఊపిరితిత్తులను తీసుకుని ఉదయం 11 గంటలకు బయలు దేరిన అంబులెన్స్ కిమ్స్ ఆస్పత్రికి 11.34 గంటలకు చేరుకుంది. ఎయిర్‌పోర్టు, కిమ్స్ ఆస్పత్రి మధ్య ఉన్న 36.8 కిలో మీటర్ల దూరాన్ని 31 నిమిషాల్లో చేరుకుంది. గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేసి అవయవదానానికి సహకరించిన పోలీసులకు ఆస్పత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.
- Advertisement -