Monday, January 20, 2025

జిహెచ్‌ఎంసి పరిధిలో భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, ప్రగతినగర్, మూసాపేట్, బాచుపల్లి, కెపిహెచ్‌బి కాలనీల్లో జోరుగా వర్షం కురిసింది. అలాగే కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, సురారం, షాపూర్ నగర్, చింతల్, జగద్గిరిగుట్ట, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వర్షపు నీరు రోడ్లపై భారీగా నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సికింద్రాబాద్, చిలకలగూడ, ప్యారడైజ్, బేగంపేట, మారేడుపల్లి, అల్వాల్, తిరుమలగిరి, బోయిన్‌పల్లి ప్రాంతాల్లో భారీగా వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Also Read: 3 ఏళ్ల కిత్రం మహిళ అదృశ్యం… సెప్టిక్ ట్యాంక్‌లో అస్థిపంజరం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News