Friday, December 20, 2024

కాస్త తగ్గిన వర్షం

- Advertisement -
- Advertisement -

కొద్దిగా తేరుకున్న నగరం
జలాశయాలతో పాటు
సాగర్‌కు కొనసాగుతున్న వరద
సాగర్ నుంచి 6 గేట్ల ద్వారా దిగువకు నీరు
ప్రాంత వాసులను అప్రమత్తం చేసిన యంత్రాంగం
పునరావాస కేంద్రాల తరలింపుకు ఏర్పాట్లు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలో వర్షం కాస్తా తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గత నాలుగు రోజులుగా ఎడతేరిపి కూడ కురిసిన భారీ వర్షంతో నగరవాసులతో పాటు యంత్రాంగ గణమంతా ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అయితే శనివారం మాత్రం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు అక్కడక్కడ చిరు జల్లులు తప్ప వర్షం పడకపోవడంతో కొంతా తేరుకున్నారు. అయితే జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లతో పాటు హుస్సేన్ సాగర్‌కు సైతం వరద ప్రవాహాం కొనసాగుతోనే ఉంది. దీంతో జిహెచ్‌ఎంసితో పాటు రెవెన్యూ పోలీసు అధికారులంతా అప్రమత్తమైయ్యారు. మరి ముఖ్యంగా హిమాయత్ సాగర్‌లోకి శుక్రవారంతో పోల్చితే శనివారం నాటికి వరద మరింత పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. దీంతో శుక్రవారం హిమాయత్ సాగర్ రెండు గేట్లు ద్దారా శుక్రవారం రెండు ఎత్తగా శనివారం ఉదయం 10 గంటలకు మరో రెండు గేట్లు, మధ్యాహ్నం 1 గంటలకు ఇంకో రెండు గేట్లు రెండు ఫీట్ల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు.

దీంతో మొత్తం 6 గేట్ల ద్వారా వరద నీటిని దిగువనున్న మూసీలోనికి వదులు తున్నారు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1763.50 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 3500 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 4120 కూసెక్కులుగా కొనసాగుతోంది. అయితే 6 గేట్ల ద్వారా నీటిని వదులుతుండడంతో మూసీ పరివాహక ప్రాంతాలైన హైదర్‌షా కోట్ల, కిస్మత్‌పూర్, పూరానాపూల్, చాదర్‌ఘట్, అంబర్‌పేట్, రామాంతాపూర్, నాగోల్ పరిసర ప్రాంతాల కాలనీ వాసులను అధికారులు అప్రమత్తం చేయడంతోపాటు తాజా పరిస్థితులను ఎప్పటీకప్పుడు అంచనా వేస్తున్నారు. అవసరమైతే లొతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు జీహెచ్‌ఎంసీ, పోలీసులు, రెవెన్యూ అధికారులు అంతా సిద్ధంగా ఉన్నారు.

అదేవిధంగా 6 గేట్లను ఎత్తడంతో హిమాయత్ సాగర్ నుంచి రాజేంద్ర నగర్ వైపు వెళ్లే ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్‌పై వాహన రాకపోకలను పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. మరోవైపు ఉస్మాన్‌సాగర్ జలాశయలోకి సైతం వరద ప్రవాహాం కొనసాగుతోది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం1785.85 అడుగులుగా ఉంది. ప్రస్తుతానికి 300 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలో వచ్చి చేరుతుండడంతో తాజా పరిస్థితుల ఎప్పటీ కప్పుడు అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత ఇన్‌ప్లో పెరిగితే గేట్లును ఎత్తేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే శనివారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలో పూర్తిగా వర్షం గరువు ఇవ్వడంతో అధికార గణం ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News