Monday, December 23, 2024

రాంనగర్ లో బైక్ ను ఢీకొట్టిన కారు: విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బైక్ ను కారు ఢీకొట్టడంతో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లోని రాంనగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బిహార్ రాష్ట్రానికి చెందిన నిఖిల్ కుమార్ (22) రాంనగర్ లోని పయనీర్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో ఫైనలియర్ చదువుతున్నాడు. రాంనగర్ చౌరస్తా నుంచి విఎస్టి వెళ్లే రోడ్డులో ఎదురుగా వేగంగా వచ్చిన పల్సర్ బైక్ ను స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టడంతో నిఖిల్ కుమార్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు చిక్కడపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక గాంధీ ఆస్పత్రికి తరలించారు. బిహార్ లో ఉన్న నిఖిల్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News