- Advertisement -
హైదరాబాద్: దేశంలో హైదరాబాద్ నగరం ఒకప్పుడు ఉద్యానవనాలు, సరస్సులతో అలరారుతుండేది. కానీ నేడు దేశంలోనే నాలుగో అత్యంత కాలుష్య నగరంగా మారిపోయింది. హైదరాబాద్ కాలుష్య నగరంగా మారిపోయిందని ఓ వాయు నాణ్యత టెక్ ఫర్మ్ ప్రచురించింది. పర్యావరణవేత్త డాక్టర్ బివి సుబ్బా రావు ఒకప్పుడు హైదరాబాద్ నగరం 58 చదరపు కిమీ.కు పరిమితమై ఉండేది, నేడు 6600 చదరిపు కిలో మీటర్లకు విస్తరించిందన్నారు. ప్రస్తుతం హెచ్‌ఎండిఏ పరిధిలో నగరం ఉందన్నారు. నగర పరిధిలోకి మరిన్ని ప్రాంతాలు చేరుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే అంతటా పచ్చదనం లేదని ఆయన వివరించారు.
- Advertisement -