Monday, January 20, 2025

ఆర్థిక నేరాల్లో హైదరాబాద్‌కు మూడో స్థానం

- Advertisement -
- Advertisement -

ఏడేళ్లలో రూ.13,000 కోట్లు కోట్టేసిన కేటుగాళ్లు
లోన్ యాప్‌ల ద్వారా రూ.2కోట్లు

Hyderabad ranks third in financial crime

మనతెలంగాణ, సిటిబ్యూరో: హైదరాబాద్ ఆర్థిక నేరగాళ్లకు అడ్డాగా మారుతోంది. దేశంలోని నగరాల్లో జరుగుతున్న ఆర్థిక నేరాల్లో హైదరాబాద్‌కు మూడో స్థానం దక్కింది. ఏడేళ్లలో ఆర్థిక నేరగాళ్లు హైదరాబాద్ కేంద్రంగా రూ.13,000 కోట్లు దోచుకున్నారు. బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం తదితరాలు చేశారు. 2015-16లో అత్యధికంగా రూ.4,1,47 కోట్లను బడాబాబులు ఎగ్గొట్టారు. సాధారణ ప్రజలు రుణం అడిగితే ముప్పుతిప్పలు పెట్టే బ్యాంక్‌లు ఆర్థిక నేరస్థులకు మాత్రం అడిగినంతా డబ్బులు ఇచ్చి నేరం చేసేందుకు సహకరిస్తున్నారు. బ్యాంక్‌లను మోసం చేసిన కార్వీ కన్సల్‌టెన్సీ, ట్రాన్స్‌ట్రాయ్, మీనా జువెల్లర్స్, సర్వోమ్యాక్స్, అగ్రిగోల్డ్ సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి కట్టకుండా నిండాముంచాయి.

లోన్ యాప్‌ల దారుణాలు…

చైనాకు చెందిన లోన్ యాప్‌ల బాధితులు వందలాదిమంది నగరంలో ఉన్నారు. లోన్ యాప్‌ల ద్వారా రూ.2,000 కోట్లను ముంచారు. కరోనా లాక్‌డౌన్ రావడంతో చాలామంది బాధితులు డబ్బుల కోసం లోన్ యాప్‌లను ఆశ్రయించారు. దీనిని తమకు అనుకూలంగా మల్చుకున్న నిందితులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో టెలీ కాలర్లను పెట్టుకుని బాధితులను మోసం చేశారు. ముందుగా తక్కువ డబ్బులు యాప్‌ల ద్వారా రుణం ఇచ్చి తిరిగి వారు కట్టకపోవడంతో మళ్లీ రుణం ఇచ్చి నిండాముంచుతున్నారు. రెండు రుణాల్లో భారీ ఎత్తున వడ్డీ వేయడంతో రుణం తీసుకున్న వారు బోరుమంటున్నారు. యాప్‌లో రుణం తీసుకున్న వారికి వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులను ఆశ్రయించడంతో వందలాది కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News