Friday, December 20, 2024

నగరంలో సీజన్ లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో గురువారం రాత్రి ఈ సీజనులోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. సాధారణ స్థాయికన్నా ఉష్ణోగ్రత పడిపోయిందని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ (టిఎస్ డిపిఎస్) డేటా తెలిపింది. హైదరాబాద్ లోని బిహెచ్ఈఎల్(11.4), రాజేంద్ర నగర్(11.5), మౌలాలి(11.9), గచ్చిబౌలి.. కుత్బుల్లాపూర్(12.7), వెస్ట్ మారెడ్ పల్లి, బండ్లగూడ, హయత్ నగర్ సగటు ఉష్ణోగ్రత 13.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదయింది. ఉష్టోగ్రత గణనీయంగా 15.2 డిగ్రీల సెల్సియస్ మేరకు పడిపోయింది. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ లో తెల్లవారున పొగమంచుతో మొదలయి క్రమేణ ఆకాశం స్పష్టంగా మారుతుందని పేర్కొంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ నుంచి 18 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండగలదని తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News