- Advertisement -
కాశ్మీర్ ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. హైదరాబాద్‌కు చెందిన మనీష్ రంజన్.. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్ కోసం జమ్ముకాశ్మీర్ కు వెళ్లారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో మనీష్ చనిపోయాడు. భార్య, ఇద్దరు పిల్లల ముందే మనీష్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్‌లో మనీష్ రంజన్ ఐబీ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు మొత్తం 27 మంది పర్యాటకులు మృతి చెందారు. ఈ దాడిపై ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు.
- Advertisement -