Wednesday, November 27, 2024

నగరంలో మరిన్ని జంక్షన్ల అభివృద్ధికి ప్రణాళికలు

- Advertisement -
- Advertisement -

సిద్దం చేయాలని
కమిషనర్ రోనాల్ రోస్ అదేశం

మన తెలంగాణ /సిటీ బ్యూరో: నగరంలోని మరిన్ని జంక్షన్ల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం కానున్నాయి. ఇప్పటీకే నగరంలో ప్రధాన మార్గాలోని అనేక జంక్షన్లను జిహెచ్‌ఎంసి సుందరీకరణతో పాటు విభిన్న థీమ్స్‌తో అభివృద్ది చేసింది. దీంతో నగర రోడ్లకు సరికొత్త అందాలు సంతరించుకోగా త్వరలోనే మరిన్ని జంక్షన్లు అభివృద్దికి నోచుకోనున్నాయి. నగరంలో దాదాపుగా 350పైగా జంక్షన్లు ఉండగా, ఇందులో 114 మేజర్ జంక్షన్ల అభివృద్దికి గతంలోనే జిహెచ్‌ఎంసి శ్రీకారం చుట్టింది. ముందుగా 60 జంక్షన్ల అభివృద్దికి ప్రణాళికలను గతంలోనే సిద్దం చేసిన జిహెచ్‌ఎంసి 4, 3 మార్గాల్లో వీటిని చేపట్టింది.

Also Read: జలపాతంలో పడిపోయిన కారు(షాకింగ్ వీడియో)

ఇందులో భాగంగా ఎల్‌బినగర్ జోన్‌లో 10, చార్మినార్ జోన్ 10, ఖైరతాబాద్ జోన్ 11, శేరిలింగంపల్లి జోన్ 9, కూకట్‌పల్లి జోన్ 9, సికింద్రాబాద్ జోన్ 11 జంక్షన్లఅభివృద్ధితో పాటు సుందరీకరణ పనులను గతంలోనే చేపట్టారు. అయితే అంతకుముందు రూ. 35 కోట్ల అంచనా వ్యయంతో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు సిగ్నల్ వ్యవస్థతో పాటు పాదచారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వివిధ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా 12 జంక్షన్లను వినూత్నగా అభివృద్ది, సుందరీకరణ పనులను చేపట్టి పూర్తి చేశారు. అంతేకాకుండా నగరంలో 150 నుంచి 200 అడుగుల వెడల్పు ఉన్న ప్రధాన మార్గాల్లో రూ.568.2 కోట్ల అంచనా వ్యయంతో 21,535 మీటర్ల మేర ఈ మోడల్ కారిడార్లుగా తీర్చిదిద్దుతున్నారు.ఇందులో భాగంగ రోడ్లకు ఇరువైపుల స్థానిక అవసరాలు స్థలం అందుబాటును బట్టి వెడ్డింగ్ జోన్‌న సర్వీస్ రోడ్డు, పార్కింగ్, పాదచారుల కోసం ప్రత్యేక గ్రీనరీ, సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పుడు మరిన్ని జంక్షన్ల అభివృద్దికి ప్రణాళికలు:  నగరంలో రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో నగరవాసులకు అవసరాలకు అనుగుణంగా మరిన్ని జంక్షన్ల అభివృద్దికి జిహెచ్‌ఎంసి ప్రణాళికలను సిద్దం చేస్తోంది. ఇందుకు సంబంధించి జిహెచ్‌ఎంసి కమిషనర్ కమిషనర్ రోనాల్ రోస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో పురపాలక శాఖ మంత్రి అధక్షతన జరిగిన 64వ సిటీ కన్వర్జెన్స్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జిహెచ్‌ఎంసి కమిషనర్ మంగళవారం రవీంద్రభారతి ,జర్నలిస్ట్ కాలనీ, జగన్నాథ్ టెంపుల్ జంక్షన్ల ను ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, ఇ.ఎన్.సి జియా ఉద్దీన్, సీసీపీరాజేంద్ర ప్రసాద్ నాయక్ లతో కలిసిపరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర మున్సిపల్, పట్టణ అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సిటీ సమన్వయ సమావేశంలో హాజరైన ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విన్నపం మేరకు రవీంద్ర భారతి జంక్షన్ వద్ద పాదాచారులకు ప్రమాదాల నివారణకు పుట్ పాత్ నిర్మాణం చేపట్టనున్నామన్నారు. అదేవిధంగా జర్నలిస్ట్ కాలనీ లో జంక్షన్ అభివృద్ధి చేయడంతోపాటు పోలీస్ శాఖ అధికారుల విజ్ఞాపన మేరకు జగన్నాథ టెంపుల్ జంక్షన్ వద్ద డివైడర్ పునర్నిర్మాణం చేపట్టాలని ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ నేపథ్యంలో ఆయా జంక్షన్లలో పలు పనులను చేపట్టేందుకు సంబంధితఅధికారులను ఆదేశించినట్లు కమిషనర్ వెల్లడించారు. ట్రాఫిక్ పోలీస్ అధికారుల సూచన మేరకు పనులను పూర్తి స్థాయిలో చేపట్టేందుకు అంచనా ప్రతిపాదనలు తయారు చేయాలని ఇ.ఎన్.సి, టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News