Monday, December 23, 2024

ముగిసిన సెయిలింగ్ పోటీలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ వేదికగా జరుగుతున్న జాతీయ సెయిలింగ్ పోటీలు శనివారం ముగిసాయి. సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఛాంపియన్‌షిప్‌లో వివిధ కేటగిరీల్లో పోటీలను నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా ప్రముఖ సెయిలర్లు పోటీ పడ్డా రు. ఇందులో అంతర్జాతీయ క్రీడాకారులు కూడా ఉన్నారు. ఈ పోటీల్లో అద్వెత్ మెనన్, కోటేశ్వరరావు, హేమంత్, అశ్విని, అక్షత్ కుమార్ తదితరులు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక హుస్సేన్ సాగర్‌లో జరిగిన ఈ పోటీలు నగర ప్రజలను కనువిందు చేశాయి. ట్యాంక్‌బాండ్, నెక్లెస్ రోడ్, లుంబి పార్క్, సంజీవయ్య పార్క్ తదితర ప్రాంతాల్లో పోటీలను తిలకించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కాగా, విజేతలకు ఆదివారం ట్రోఫీలను బహూకరిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News