Monday, December 23, 2024

సనత్‌నగర్‌లో బాలుడిని బకెట్‌లో ముంచి… మృతదేహాన్ని నాలాలో పడేశారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సనత్‌నగర్‌లో బాలుడు అబ్దుల్ వహిద్‌ను బకెట్‌లో ముంచి చంపి అనంతరం నాలాలో పడేశారు. అబ్దుల్ వహిద్ హత్య నరబలి కాదని పోలీసులు తెలిపారు. ఇమ్రాన్, ఆటో ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బుల విషయంలో ఇమ్రాన్, వహీద్ కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గతంలోనే బాలుడిని చంపుతానని ఇమ్రాన్ పలుమార్లు బెదిరించాడు. గురువారం నమాజ్‌కు వెళ్లిన వహీద్‌ను ఇమ్రాన్ తీసుకెళ్లాడు. నిందితుడు ఇమ్రాన్ బాలుడిని బకెట్‌లో ముంచి చంపాడు. వహీద్ మృతదేహాన్ని సంచిలో వేసి ఆటోలో తీసుకెళ్లినట్టు గుర్తించారు. స్థానిక సిసి కెమెరాలో దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. స్థానికులు జింకలవాడ నాలాలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: బావిలో దూకిన భార్యను రక్షించి… రతికి అంగీకరించడంలేదని భార్య మర్మాంగాలపై

సనత్‌నగర్‌లో బాలుడి మృతి ఘటన బాధాకరమైన విషయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News