Friday, January 31, 2025

రూ.232.7 కోట్లతో హైదరాబాద్‌లో సైన్స్ సిటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ను శాస్త్రీయ ఆవిష్కరణలకు కేంద్రంగా మార్చడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా రూ.232.7 కోట్ల నిధులతో సిఎస్‌ఐఆర్ ఐఐసిటిలో త్వరలో సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తోందని ఆయన శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రపంచ స్థాయి సౌకర్యం యువతను పరిశోధనల వైపు ప్రేరేపిస్తుందని, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. తెలంగాణ యువతకు ఆచరణాత్మక అభ్యాస అనుభవాలను అందిస్తుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ సైన్స్ సెంటర్‌లో -ఇంటరాక్టివ్, ఇమ్మర్సివ్ ఎగ్జిబిట్స్, -ఖగోళ శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం,

-రోబోటిక్స్, ఇన్నోవేషన్ హబ్, 3డి డిజిటల్ డోమ్ థియేటర్, -వాక్-త్రూ అక్వేరియం, -మోషన్ సిమ్యులేటర్ వంటి విభాగాలతో పాటు -విద్యార్థి కార్యకలాపాలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్‌లో సైన్స్ సిటీ ఏర్పాటుతో శాస్త్ర పరిశోధన రంగంలో హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఖాతికి చేరుతుందని వెల్లడించారు. తెలంగాణలోని విద్యార్థులు, పరిశోధకులకు విజ్ఞాన శాస్త్రాన్ని ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. హైదరాబాద్ ఇప్పటికే సాంకేతికత, పరిశోధనలకు ప్రసిద్ధి చెందిందని గుర్తు చేస్తూ సైన్స్ సిటీ శాస్త్రీయ అభివృద్ధిలో అగ్రగామిగా తన స్థానాన్ని మరింత విస్తరింప చేస్తుందని కేంద్రమంత్రి ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News